బిగ్ రిలీఫ్.. జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ లేదు. ఈ మేరకు ఫిలిం చాంబర్ ప్రకటన చేసింది. ఎగ్జిబిటర్ల డిమాండ పై ఫిలిం ఛాంబర్ లో ఉమ్మడి సమావేశం జరిగింది. నిర్మాతలు.. డిస్టిబ్యూటర్స్.. ఎగ్జిబిటర్స్ ఉమ్మడి సమావేశం నిర్వహించింది ఫిలిం చాంబర్.. ఈ సందర్బంగా ఫిలిం ఛాంబర్ జనరల్ సెక్రటరీ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ …ఈ రోజు ఉదయం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు ఉమ్మడి సమావేశం జరిగిందన్నారు.

థియేటర్లు మోసివేయడం లేదు.. బంద్ కూడా లేదు..ఈ నెల 30 వ ఈసి మీటింగ్ లో కమిటీ వేస్తామన్నారు. ఎగ్జిబిటర్ల పర్సంటేజీ అంశంపై ఓ కమిటీ వేస్తాం..ఒక టైం లైన్ పెట్టుకొని.. అన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని సమస్య ను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
అప్పటివరకు థియేటర్ల బంద్ నిలిపివేస్తున్నాముని చెప్పారు ఫిలిం ఛాంబర్ జనరల్ సెక్రటరీ దామోదర ప్రసాద్.