ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ కి షాక్ … ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు ..!

-

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. రౌద్రం రణం రుధిరం పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలంగాణ పోరాట యోధుడు కొమరం భీం పాత్రలో, అలానే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఫిక్షన్ కథతో హిస్టారికల్ బ్యాగ్డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటి అలియా భట్, ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

 

ఇక రీసెంట్ గా ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టైటిల్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో పాటు రామ్ చరణ్ పోషిస్తున్న అల్లూరి సీతారామరాజు పాత్ర ని రివీల్ చేశారు ఆర్ఆర్ఆర్ యూనిట్. వీటికి అటు అభిమానులతో పాటు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి. అప్పటి నుంచి తారక్ పాత్ర ని చూడాలని అభిమానులు ఆతృతగా ఉన్నారు. ఇక యూనిట్ కూడా ఎన్.టి.ఆర్ బర్త్ డే గిఫ్ట్ గా తారక్ పాత్రని రివీల్ చేస్తామని వెల్లడించారు. మే 20 న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా తారక్ పోషించిన కొమరం భీం పాత్ర తో వీడియో టీజర్ వస్తుందనుకున్న ఫ్యాన్స్ కి ప్రేక్షకులకి షాక్ తగిలింది.

కరోనా కారణంగా కొనసాగుతున్న లాక్ డౌన్ ని మరిన్ని రోజులు పొడిగింపబడడంతో టెక్నికల్ ఇష్యూస్ తలెత్తడం తో కొమరం భీం ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయలేము అని తాజాగా ప్రకటించారు. అయితే ఈ పరిస్థితిని అందరూ అర్ధం చేసుకోవాలని కోరిన ఆర్ఆర్ఆర్ యూనిట్, అవకాశం ఉంటే అతి త్వరలో మంచి సమయం చూసుకుని కొమరం భీం ఫస్ట్ లుక్ ని తప్పక రిలీజ్ చేస్తాం అని వెల్లడించారు. ఇక ఈ ప్రకటనతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు యావత్ తెలుగు ప్రేక్షకులకి నిరాశ తప్పలేదు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version