పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమా ఇటీవల రిలీజ్ అయి.. మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ఏం ఏ రత్నం నిర్మాణంలో ఈ సినిమా.. వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా చేయగా నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించారు. అయితే మంచి కలెక్షన్స్ తో దూసుకు వెళ్తున్న హరిహర వీరమల్లు సినిమాకు తాజాగా ఊహించని షాక్ తగిలింది.

ఈ సినిమా టికెట్ల ధరలు భారీగా తగ్గిపోయాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఇవాల్టి నుంచి ఆగస్టు రెండో తేదీ వరకు టికెట్ల ధరలు తగ్గిపోనున్నాయి. రెండు రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం మేరకు ఈ రూల్ అమల్లోకి రాబోతుంది. అటు హరిహర వీర మల్లు చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుంది. పలు మార్పులు చేస్తూ థియేటర్లో అప్డేట్ వర్షన్ కూడా తీసుకొస్తుంది.