హైదరాబాద్‌లో మరో దారుణం జరిగింది.. బీర్ బాటిళ్లతో దాడి చేయించి భర్తను చంపేందుకు భార్య ప్లాన్ చేసింది. హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్-దుండిగల్ పీఎస్ పరిధిలో ఈ దారుణం జరిగింది. భర్త రాందాస్‌ను చంపేందుకు నలుగురు యువకులతో కలిసి పథకం వేసింది భార్య జ్యోతి. బౌరంపేటలో రాందాస్‌కు మద్యం తాగించి, బీర్‌బాటిళ్లతో దాడి చేశారు యువకులు.

రాందాస్ అపస్మారకస్థితిలోకి వెళ్లడంతో చనిపోయాడనుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు యువకులు. తీవ్ర గాయాలతో తన తమ్ముడి ఇంటికి వెళ్లి విషయం చెప్పారు బాధితుడు రాందాస్. బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.