BIGBOSS-7 విజేత ప్రశాంత్ పై క్రిమినల్ కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు ఆయనను అరెస్టు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విజేతగా నిలిచిన అనంతరం పోలీసులు ప్రశాంత్ ను ఇంటికి పంపగా…. కాసేపటికే అనుచరులతో కలిసి అతడు మళ్ళీ స్టూడియో వద్దకు వచ్చారు. అప్పటికే అక్కడ ఉన్న అమర్ దీప్ అభిమానులు, ఇతర కంటెస్టెంట్ల ఫ్యాన్స్ రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఎస్సై రాకేష్ ఫిర్యాదుతో ప్రశాంత్ పై కేసు నమోదు అయింది.
కాగా, బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా రైతుబిడ్డ ప్రశాంత్ నిలిచారు. విజేతగా నిలిచినందుకు ఆయనకు రూ. 35 లక్షల ప్రైస్ మనీ దక్కింది. దానితోపాటు రూ. 15 లక్షల విలువ చేసే కారు, రూ. 15 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ సొంతం చేసుకున్నారు. వీటితో పాటు ప్రశాంత్ రెమ్యూనరేషన్ లక్షల్లోనే ఉండనుంది. ఓవరాల్ గా రూ. కోటి విలువైన సొత్తును ఆయన దక్కించుకున్నారు.అయితే..బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా నిలిచిన రైతుబిడ్డ ప్రశాంత్…..తాను గెలిచిన రూ.35 లక్షలను రైతుల కోసమే వినియోగిస్తానని ప్రకటించారు.