బిగ్‌బాస్ 4: ‌క‌మ‌ల్ బ‌ర్త్‌డే.. హారిక ఛాన్స్ కొట్టేసింది!

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్‌హాసన్ 66వ పుట్టిన రోజు నేడు. ఈ సంద‌ర్భంగా బిగ్‌బాస్ షోలో ప్ర‌త్య‌క్ష‌మైన క‌మ‌ల్ బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్‌ల‌కి బిగ్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ రోజు ఆయ‌న‌ని కంటెస్టెంట్‌ల‌తో విష్ చేయించ‌డం కోసం బిగ్‌బాస్ నిర్వాహ‌కులు క‌మ‌ల్‌ని లైవ్‌లోకి తీసుకొచ్చారు. క‌మ‌ల్‌ని చూసిన కంటెస్టెంట్స్ ప‌ట్ట‌రాని ఆనందంతో అరుపులు కేక‌ల‌తో క‌మ‌ల్‌కి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు అంద‌జేశారు.

ఈ వారం ఎలిమినేష‌న్‌లో ఐదుగురు స‌భ్యులున్నారు. అభిజిత్‌, హారిక‌, అమ్మ రాజ‌శేఖ‌ర్‌, అవినాష్‌, మోనాల్‌, సోహైల్ వున్నారు. వీళ్ల‌లో ఈ రోజు ఎవ‌రు సేవ్ అవుతారా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ సంద‌ర్భం ఇదే విష‌యాన్ని క‌మ‌ల్‌కి వెల్ల‌డించిన నాగార్జున ఈ ఐదుగురిలో ఒక్క‌రిని సేవ్ చేయ‌మ‌ని సీక్రెట్‌గా ఓ పేరుని చూపించాడు.

వెంట‌నే స‌భ్యులంతా నాగ్‌తో క‌లిసి కౌంట్ డౌన్ మొద‌లుపెట్టారు. అనూహ్యంగా ఈ ఐదుగురు స‌భ్యుల్లో హారిక సేవ్ అయిన‌ట్టు క‌మ‌ల్ ప్ర‌క‌టించ‌డంతో హారిక ఆనందంతో కేరింత‌లు కొట్టింది. బ‌ర్త్‌డే రోజున సేవ్ చేయ‌డంతో హార‌క‌కు క‌మ‌ల్ బ‌ర్త్‌డే గిఫ్ట్ ఇచ్చిన‌ట్టయింది.