బిగ్ బ్రేకింగ్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ ఘన విజయం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్ ఘన విజయం సాధించాడు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన జో బిడెన్ అమెరికాకి 46వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సుదీర్ఘంగా సాగిన ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. 284 ఎలక్టోరల్ ఓట్లలో విజయం సాధించినట్టు అమెరికా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

538 సీట్లకుగాను జో బిడెన్ 284 సీట్లు దక్కగా చివరి వరకు గట్టిపోటీ ఇచ్చిన అమెరికా ప్రస్తుత అధ్యక్ష్యుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం 214 సీట్లకే పరిమితం అయ్యాడు. ఇక ఉపాధ్యక్షురాలిగా కూడా డెమాక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమల హరి సంచలన విజయం సాధించారు. ఆమె భారత సంతతికి చెందిన ఆమె. అయితే ట్రంప్ మాత్రం తానే గెలిచానని ట్వీట్ చేయడం గమనార్హం.