బిగ్‌బాస్ 4: ఈ రోజు ఎలిమినేట్ అయ్యేది అత‌నే?

బిగ్‌బాస్ సీజ‌న్ 4 రోజుకో కొత్త మ‌లుపు తిరుగుతోంది. 9వ వారంలోకి ఎంట‌రైన బిగ్‌బాస్ షో నామినేష‌న్ ప్ర‌క్రియ‌తో మ‌రింత హీటెక్కింది. ఇంటి స‌భ్యుల్లో ఎవ‌రిపై ఎవ‌రికి ప్రేమ‌, అభిమానం వుందో చిన్న చిన్న‌గా బ‌య‌ట‌ప‌డం మొదలైంది. ప్రేక్ష‌కుల ఓటింగ్‌ని బ‌ట్టే ఎలిమినేష‌న్ వుంటుంద‌ని శ‌నివారం మ‌రోసారి నాగార్జున స్ప‌ష్టం చేశారు. ఇంటి స‌భ్యుల్లో ఎవ‌రిపై మీకు ఫిర్యాదులున్నాయో చెప్పాల‌ని, ఇందుకు షోలో వెలిగిపోయే దీపం…ఆరిపోయే దీపం ఎవ‌రో చెప్పి కారణాల వివ‌రించాల‌ని నాగ్ చెప్ప‌డంతో మ‌ళ్లీ గేమ్ షో మొద‌లైంది.

అభిజిత్ ముందుగా అమ్మ రాజ‌శేఖ‌ర్ మాస్ట‌ర్‌ని ఆరిపోయే దీపం అంటూ త‌న రీజ‌న్ వివ‌రించాడు. అయితే అత‌ను కెప్టెన్ అని అత‌ని మాట వినాల‌ని అ‌మ్మ రాజ‌శేఖ‌ర్‌ని స‌పోర్ట్ చేయ‌డం కొంత వీవ‌ర్స్‌కి మింగుడు ప‌డ‌లేదు. కెప్టెన్ అయ్యాక అమ్మ ధోర‌ణి ప‌గ సాధిస్తా అనే రీతిలో సాగిందే కానీ ఏ కోణంలోనూ సాఫీగా సాగ‌లేదు. అత‌నికి అసిస్టెంట్‌గా అరియానా ఓవ‌రాక్ష‌న్ మ‌రోటి. దీంతో బిగ్‌బాస్ ఓటింగ్ స‌ర‌ళి అనేది నామ‌మ‌త్ర‌మ‌నే అనుమానాలు వ్య‌క్త మ‌వుతున్నాయి. ఈ వారం నామినేష‌న్‌లో వున్న ఇంటి స‌భ్యుల్లో హారిక క‌మ‌ల్ కార‌ణంగా సేవ్ అయ్యింది. ఇక బుట్ట బ‌రువెక్కాలి అనే సింప‌థీ గేమ్‌లో మోనాల్‌కి అఖిల్ మిన‌హా ఎవ‌రూ స‌పోర్ట్ చేయ‌క‌పోవ‌డంతో అవినాష్‌కే లాస్య‌, మెహ‌బూబ్‌, సోహైల్‌, అరియానా స‌పోర్ట్ చేయ‌డంతో వచ్చే వారం ఎలిమినేట్ కాకుండా ఇమ్యూనిటీని సాధించాడు. దీంతో మోనాల్ ప‌రిస్థితి మ‌రింత దారుణంగా మారింది.

ఇక ఈ వారం నామినేష‌న్‌లో వున్న స‌భ్యులు అభిజిత్‌, మోనాల్‌, అమ్మ రాజ‌శేఖ‌ర్‌, అవినాష్‌లు వున్నారు. వీరిలో గ‌త కొన్ని వారాలుగా అదృష్టం కొద్దీ నెట్టుకొస్తున్న కంటెస్టెంట్ అమ్మరాజ‌శేఖ‌ర్‌. గ‌త వారం ఫైన‌ల్ ఎలిమినేష‌న్ రౌండ్‌లోనే అమ్మా రాజ‌శేర్ ప‌ని అయిపోయింది. హౌస్‌లో అమ్మ రాజ‌శేఖ‌ర్‌, మెహ‌బూబ్‌ల‌లో ఎవ‌రికి వుండే అర్హ‌త వుంది.. ఎవ‌రికి లేదు అని నాగ్ జ‌రిపిన ఓటింగ్‌లో ఇంటి స‌భ్యుల్లో అవినాష్‌, అరియానా త‌ప్ప అంతా అమ్మా రాజ‌శేఖర్ హౌస్‌లో వుండే అర్హ‌త లేద‌ని ఖ‌రాకండీగా చెప్పేశారు. నోయెల్ రిక్వెస్ట్ మేర‌కు ఎలిమినేష‌న్ గండం నుంచి త‌ప్పుకున్న అమ్మ రాజ‌శేఖ‌ర్ ఈ ఆదివారం హౌస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చేస్తున్నాడు. అత‌నికి మ‌రో ఆప్ష‌న్ కానీ అవ‌కాశం కానీ లేదు. దీంతో అమ్మ రాజ‌శేఖ‌ర్ ఎలిమినేష‌న్ ఆదివారం లాంఛ‌‌న‌మే.