బిగ్ బాస్: పాపం.. హారిక బలైపోయింది .

-

బిగ్ బాస్ లో ఈ వారం హోటల్ టాస్క్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. మెహబూబ్, సోహైల్, హారిక, అరియానా, గంగవ్వ అతిధులుగా మిగతా వారందరూ హోటల్లో పనిచేసే వారిగా ఆసక్తి కలిగిస్తున్నారు. అతిధులకి కావాల్సిన వాటిని చేకూర్చుతూ వారి నుండి స్టార్లు పొందడం హోటల్ వారి పని. ఐతే ఇక్కడ హోటల్ వారికి స్టార్లు రాకుండా అతిధి మర్యాదల్లో ఏదో ఒక అవాంతరం కలగజేసే వాడిగా అవినాష్ సీక్రెట్ టాస్క్ చేస్తున్నాడు. దానివల్ల అతిధులు ఇబ్బందులు పడుతున్నారు. బిర్యానీలో ఉప్పు ఎక్కువ కలపడం, అన్నంలో వెంట్రుకలు రావడం వగైరా చేస్తూ అతిధులకి హోటల్ వారి మీద కోపం వచ్చేలా చేస్తున్నాడు.

ఐతే అతిధిగా ఉన్న హారిక, తాను చేసిన పనులన్నీ చేసినందున తనకి చెంచిన ఒక స్టార్ ఇస్తానని చెప్పి, నాలుగు స్టార్లని అభిజిత్ చేతిలో పెట్టింది. దాంతో అభిజిత్, నాలుగు స్టార్లు మాకే వచ్చాయంటూ చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో హారిక అలా కాదని, మీరు తీసుకున్నారని, తీసుకోవడం కాదు తెచ్చుకోవాలని చెప్పింది. కానీ అభిజిత్ అవేమీ పట్టించుకోకుండా మాకు నాలుగు స్టార్లు వచ్చాయంటున్నాడు.

ఇక్కడ విశేషం ఏమిటంటే, అంతకుముందే తనని అభిజిత్ గ్రూపులో ఎందుకు వేయలేదని బిగ్ బాస్ ని నిందించింది. దానికి అభిజిత్, మనమిద్దరం క్లోజ్ అవుతున్నామన్న ఉద్దేశ్యంతో ఇలా చేసుంటాడని చేతి సంజ్ఞల ద్వారా తెలిపాడు. ఐతే అభిజిత్ అప్పుడే అనుకున్నాడో, లేక తర్వాత అనుకున్నాడో తెలియదు గానీ హారిక స్నేహ పూర్వకంగా నాలుగు స్టార్లని చేతిలో పెట్టిన విషయాన్ని సీరియస్ గా తీసుకుని, తమకి స్టార్లు వచ్చేసాయని అంటున్నాడు.

బిగ్ బాస్ హౌస్ లో స్నేహం పనికిరాదు గేమ్ గేమ్ లానే ఆడాలి అనే విషయాన్ని హారిక అర్థం చేసుకోలేకపోయింది. మరి రేపు బిగ్ బాస్ ఏమంటాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news