బిగ్‌బాస్‌లో వైల్డ్ కార్డ్ “జ‌బ‌ర్ద‌స్త్” ఎంట్రీ..

-

బిగ్ బాస్ సీజన్ 4 కి ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇంటి సభ్యులందరూ తమ తమ ప్రవర్తనతో ప్రేక్షకుల్లో ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. మొదటి రెండు ముడు రోజులు చేసిన డ్రామా కాస్తా తగ్గింది. అందువల్లే ప్రేక్షకులతో కనెక్షన్ పెరిగింది. అయితే ఈ కనెక్షన్ మరింత గట్టి పడడానికి బిగ్ బాస్ యాజమాన్యం ప్రయత్నిస్తూనే ఉంది. మొదటగా, సూర్య కిరణ్ ఎలిమినేట్ అవ్వగానే కొత్త కంటెస్టెంట్ కుమార్ సాయిని హౌస్ లోకి తీసుకువచ్చారు.

తాజాగా హౌస్ అంతా ఇంట్రెస్టింగ్ గేమ్స్ తో నడుస్తూ ఉంది. డ్యాన్స్ బేబీ డ్యాన్స్‌, కామెడీ షోలతో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న బిగ్‌బాస్ నిర్వాహ‌కులు గేమ్ షో ని మరింత రసవత్తరం చేయడానికన్నట్టు జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్‌ని రంగంలోకి దించారు. ఈ మేరకు జోకర్ వస్తున్నాడంటూ తెలిపిన బిగ్ బాస్, జబర్దస్త్ ద్వారా పేరు తెచ్చుకున్న ముక్కు అవినాష్ ని తీసుకువచ్చారు. హౌస్ లో చాలామంది ఉన్నా కూడా నవ్వించేవారు కరువైపోయారు. అందుకే జోకర్ గా కమెడియన్ ముక్కు అవినాష్ ని దించుతున్నారు. మరి ముక్కు అవినాష్ ప్రేక్షకులని ఏ విధంగా ఆకట్టుకుంటాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news