బిగ్ బాస్: ఈ సారి కూడా అమ్మాయిలకి అదృష్టం లేనట్టేనా..?

ఈ వారంలో కంటెస్టెంట్లకి వారి కుటుంబ సభ్యులని కలుసుకునే అవకాశం కల్పించిన బిగ్ బాస్, శనివారం నాగార్జున గారి ఎపిసోడ్ లో కూడా మరో మారు ఆ అవకాశం ఇచ్చారు. ఒక్కొక్క కంటెస్టెంట్ ని నాగార్జున గారు ప్రశ్నలడుగుతూ, ఆ ప్రశ్నకి సరైన సమాధానం చెప్పిన వారికే కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం ఉంటుందని తెలిపాడు. అందరూ తమ తమ జవాబుతో నాగర్జున గారిని మెప్పించినప్పటికీ, అవినాష్ సరిగ్గా చెప్పలేకపోయాడు. ఫలితం తన కుటుంబ సభ్యులని కలవలేకపోయాడు.

ఐతే నాగార్జున గారితో స్టేజి పంచుకున్న కుటుంబ సభ్యులకి టాప్ 5లో ఎవరుంటారని అడిగితే, ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందించారు. వారందరి స్పందనలని బట్టి చూస్తే, ఈ సారి కూడా బిగ్ బాస్ టైటిల్ అబ్బాయిలకే అందేట్లు కనిపిస్తుంది. వచ్చిన వాళ్ళందరూ సోహైల్, అభిజిత్, అఖిల్ ల పేర్లు ఖచ్చితంగా చెప్పుకుంటూ వెళ్లారు. మోనాల్, లాస్య పేర్లయితే తక్కువగా వినిపించాయి. అవినాష్ కుటుంబ సభ్యులు రానప్పటికీ మోనాల్ తో సమానంగా ఓట్లు పడ్డాయి.

ఈ లెక్కన చూసుకుంటే టాప్ 5లో సోహైల్, అభిజిత్, అఖిల్, హారిక, ఆరియానా ఉండేలా ఉన్నారు. మళ్ళీ ఈ ఐదుగురిలో ఎక్కువ ఫాలోయింగ్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నవారికే ఉంది.
కాబట్టి బిగ్ బాస్ నాలుగవ సీజన్ కూడా అబ్బాయిలకే చెందుతుందనే అనుకుంటున్నారు. మరి అంతా అనుకుంటున్నట్టు ఈ సారి కూడా టైటిల్ విన్నర్ అబ్బాయిలే అవుతారా లేదా మిగిలిన రోజుల్లో తమదైన ఆటతీరు కనబర్చి పోటీలోకి వచ్చి టైటిల్ గెలుచుకుంటారా అనేది చూడాలి.