రామ్‌ చరణ్‌ సినిమాలో ‘బిగ్‌బాస్‌ 7’ కంటెస్టెంట్‌

-

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బిగ్ బాస్ సీజన్ – 7 తెలుగు కంటెస్టెంట్ అవకాశం దక్కించుకున్నాడు. అతనెవరంటే.. అంబటి అర్జున్. వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అర్జున్.. టాస్కులు ఆడుతూ.. కామెడీ చేస్తూ తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఎప్పుడూ ముఖంపై చెరగని చిరునవ్వుతో హాయిని పంచుతున్నాడు. అయితే దీపావళి పండుగ సందర్భంగా బిగ్ బాస్ హౌజ్ లో నాగార్జున కంటెస్టంట్ల కుటుంబ సభ్యులను, స్నేహితులను పిలిచి సర్ ప్రైజ్ ఇచ్చారు.

ఈ క్రమంలో అంబటి అర్జున్ కోసం డైరెక్టర్ బుచ్చిబాబు వచ్చాడు. హౌజ్ లో ఆయన అంబటి అర్జున్‌ ఆట తీరును మెచ్చుకున్నాడు. అంతే కాకుండా తాను రామ్ చరణ్ తో తీయబోయే సినిమాలో ఆఫర్ ఇచ్చాడు. దీంతో అర్జున్ బుచ్చిబాబుకు థాంక్స్ చెప్పాడు.

మరోవైపు తనకోసం వచ్చిన బుచ్చిబాబుకు అర్జున్ థాంక్స్ చెప్పాడు. ఆ తర్వాత రామ్ చరణ్  సినిమాలో సూపర్‌ క్యారెక్టర్‌ చేయబోతున్నావ్‌. ఫిక్స్‌ అయిపో’ అంటూ పండగ వేళ అర్జున్‌కి ఊహించని కానుక ఇచ్చాడు బుచ్చిబాబు. దీంతో, అర్జున్‌ అమితానందంలో మునిగిపోయాడు. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఏఆర్‌ రెహమాన్‌ పనిచేస్తున్నట్లు బుచ్చిబాబు అధికారికంగా ప్రకటించాడు.

Read more RELATED
Recommended to you

Latest news