ఇట్స్ క్లియ‌ర్‌.. బిగ్‌బాస్ విన్న‌ర్ ఆమె

-

బిగ్‌బాస్ 8 తెలుగు సీజ‌న్ 8 మొద‌లైంది. ఈ టీవీ షోకి ప్ర‌త్యేక‌మైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు 7 సీజ‌న్లు విజ‌య‌దవంతమ‌య్యాయి. ఇక కింగ్ నాగ్ బిగ్ బాస్ షోకి మ‌ళ్ళీ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఇక నిన్న ఆదివారం సెప్టెంబ‌ర్ 1న షో ప్రారంభం అయ్యింది. ఈ షోలో పార్టిసిపేట్ చేసే కంటెస్టంట్ లిస్ట్ అంటూ చాలా పేర్లు వినిపించాయి. ఇక ఫైన‌ల్‌గా 14 మంది కంటెస్టంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

యాంకర్ విష్ణు ప్రియ
ఆదిత్య ఓం
నిఖిల్ మలియక్కల్ (సీరియల్ నటుడు)
అభయ్ నవీన్ (నటుడు, యూట్యూబర్)
పృథ్వీరాజ్ ( నాగ పంచమి హీరో )
యష్మీ గౌడ (సీరియల్ నటి)
శేఖర్ బాషా (ఆర్జే)
ప్రేరణ కంభం (సీరియల్ నటి)
కిరాక్ సీత (యూట్యూబర్, బేబీ ఫేమ్)
నైనిక (ఢీ డాన్సర్)
బెజవాడ బేబక్క (సోషల్ మీడియా ఫేమ్)
సోనియా
నాగ మణికంఠ (యూట్యూబర్)
న‌బీల్ అఫ్రిది

పై లిస్ట్ చూస్తే ఇప్ప‌టికే విష్ణు ప్రియ విన్న‌ర్ అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. యువ‌కుల‌ను ఆక‌ట్టుకునే అందంతో పాటు ఫిజిక‌ల్‌గా కూడా ఫిట్‌నెస్ మెయిన్‌టైన్ చేస్తుంది. జిమ్ వ‌ర్కౌట్స్, జిమ్నాస్టిక్స్ చేస్తున్న వీడియోలు సోష‌ల్ మీడియాలో ఎంత‌గా వైర‌ల్ అయ్యాయో అంద‌రికీ తెలిసిందే. అలాగే ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువే. ఫిజిక‌ల్ టాస్క్‌ల్లో కూడా మేల్ కంటెస్టంట్స్‌కి ట‌ఫ్ ఫైట్ ఇవ్వ‌గ‌ల‌దు. చ‌లాకీత‌నం, మాట‌కారి కావ‌డం అద‌న‌పు బ‌లాలు.

ప్ర‌తీ సీజ‌న్‌లో మేల్ కంటెస్టంట్స్ మాత్ర‌మే విజేత‌గా నిలుస్తూ వ‌స్తున్నారు. ఈ సారి ఫిమేల్ విన్న‌ర్‌ను మ‌నం చూడ‌బోతున్నామ‌ని సోష‌ల్ మీడియాలో విష్ణు ప్రియ పేరును వైర‌ల్ చేస్తున్నారు. ఇంకా విన్న‌ర్స్‌గా నిలిచే పేర్ల‌లో నిఖిల్‌, నాగ పంచమి సీరియ‌ల్‌ హీరో పృథ్వీరాజ్ ఉన్నారు. ఇక శేఖ‌ర్ బాషాకు ఫాలోవ‌ర్స్ ఉన్నా కూడా ఫిజిక‌ల్ టాస్క్ ల్లో ఎంత‌వ‌ర‌కు నెగ్గు్కు రాగ‌ల‌డో అనేది డౌట్ గా క‌నిపిస్తుంది.

అప్ప‌టి హీరో ఆదిత్య ఓం విన్న‌ర్ అవ్వ‌గ‌ల‌డా అంటే..? గ‌త సీజ‌న్లో బాలాదిత్య‌, శివాజీ, నట్ రాజ్ మాస్ట‌ర్ ల పాత్ర‌ను మాత్ర‌మే పోషించ‌గ‌ల‌డేమో కానీ టాప్ 5లో కూడా ఉంటాడో లేడో చూడాలి. మిగిలిన కంటెస్టంట్స్‌కి వారి వారి ప‌ర్ఫార్మెన్స్, టాస్క్‌ల్లో చూపె తెగువ‌, ప్ర‌వ‌ర్త‌న‌ను బ‌ట్టి టాస్ 5కి చేర‌వ‌చ్చు. మొత్తంగా లిస్ట్‌లో విష్ణు ప్రియ గెలిచే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. చూడాలి సీజ‌న్ విన్న‌ర్ ఎవ‌రు అవుతారో.

Read more RELATED
Recommended to you

Latest news