Bigg Boss: వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్‌బాస్.. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను సంపాదించుకున్న బిగ్గెస్ట్ షో. ఈ షో.. హిందీ, తమిళ, కన్నడ, మళయాళ భాషాలలోనే కాకుండా ఇప్పుడూ తెలుగు ప్రేక్షకుల మదిని కూడా దోచుకుంది. విజయవంతంగా 4 సీజన్లను పూర్తి చేసుకుని 5 వ సీజన్లోకి అడుగుపెట్టింది.
తెలుగులో ఏమాత్రం అంచనాలు లేకుండానే ప్రారంభమైన బిగ్ బాస్ అన్ని సీజన్లల్లోనూ ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది.
అయితే ఈ షో సక్సెస్ వెనుక హోస్టుల పాత్ర కూడా ఉందనే చెప్పాలి. బిగ్ బాస్ తెలుగు షోకి మొదటగా టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ హోస్ట్ చేయగా, ఆ తరువాత న్యాచులర్ స్టార్ నాని తనదైన శైలిలో యాంకరింగ్ చేసి.. తెలుగు ప్రేక్షకుల్లో తీసుకవెళ్లారు. ఆ తరువాత టాలీవుడ్ మన్మధుడు, కింగ్ నాగార్జున బిగ్బాస్ స్టేజ్ మీదికి ఏంట్రీ ఇచ్చాడు. అక్కినేని నాగార్జున నడిపించిన మూడు, నాలుగు సీజన్లకైతే.. స్పందన మాములుగా లేదు. వరుసగా మూడు, నాలుగు సీజన్లకు సక్సెస్ పూల్‌గా హోస్ట్ చేశారు. ఇప్పుడు ఐదో సీజన్‌కు కూడా ఆయనే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. నాగార్జున తమదైన శైలి హోస్టింగ్‌తో అద్భుతంగా నడిపించి బిగ్ బాస్‌ను ప్రేక్షకులకు మరింత చేరువగా తీసుకెళ్లారు. దీంతో వాళ్ల నుంచి భారీ స్థాయిలో స్పందనను కూడగట్టారు. ఆయన హోస్ట్‌గా చేసిన షోలకు రికార్డు స్థాయిలో రేటింగ్ వచ్చింది.
ఎన్టీఆర్ హోస్ట్‌గా వచ్చిన తొలి సీజన్‌కి 16.18 రేటింగ్ రాగా.. నాని హెస్ట్ చేసిన రెండో సీజన్ 15.05 రేటింగ్ వచ్చింది. అయితే మూడో సీజన్‌కి మాత్రం 17.9 రేటింగ్ సాధించి.. ఎన్టీఆర్ రికార్డ్‌ని బ్రేక్ చేశారు నాగార్జున. అయితే నాలుగో సీజన్ మాత్రం ఓ రేంజ్ .. అన్ని సీజన్ల రేటింగ్లను బద్దలు కొడుతూ.. పాత రికార్డలను తిరగ రాస్తూ.. 18.5 రేటింగ్ కైవసం చేసుకోని హిస్టరీని క్రియేట్ చేసింది. దీంతో స్టార్ మా ఛానెల్ ఇండియాలోనే నెంబర్ వన్ స్థానం లో నిలిచింది. దీంతో నాగ్‌పై ప్రశంసల వర్షం కురిసింది. దీంతో 5 సీజన్ కూడా ఆయనే హోస్ట్‌గా వ్యవహరించే ఛాన్స్ ఇచ్చింది. ప్రస్తుతం నడుస్తున్న ఈ సీజన్ కూడా అదే రేంజ్ దూసుకపోతుంది. కానీ.. తాజాగా ప్రకటించిన ఐదో సీజన్ మాత్రం పాత రికార్డులను బ్రేక్ చేయలేకపోయింది. కేవలం 18 రేటింగ్ మాత్రమే సాధించింది. అంటే ఈ లెక్కన సీజన్ 4తో పోల్చుకుంటే సీజన్ 5 వెనుకబడినట్టే.!
ఇదిలా ఉంటే.. ఈ తరుణంలో బిగ్బాస్ పై ఓ ఆసక్తికర చర్చ మొదలైంది. ఆ తరువాత ప్రారంభమైయే.. బిగ్ బాస్ సీజన్ 6 కి హోస్ట్ ని మార్చనున్నారా? ఓ వేళ మార్చే హోస్ట్‌గా ఎవరు వ్యవహరిస్తారు ? అనే ప్రశ్నలు చక్కర్లు కొడుతున్నాయి. మరీ..! మార్చే అవకాశం ఉంటే.. ఏ సార్ట్ హీరోను హోస్ట్ గా పెట్టే అవకాశముందనే ప్రశ్నకు .. చాలా ఇన్‌ట్రెస్టింగ్ అన్సర్లు వస్తున్నాయి. ఎక్కువ మంది ఆ హీరోకే ఓటేస్తున్నారు. ఆ సార్ట్ ఎవరో కాదండీ.. మెగా హీరో .. అదేనండీ మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.
శనివారం జరిగిన వీకెండ్ షోలో రామ్ చరణ్ ప్రత్యేక అతిథిగా అడుగుపెట్టి అందరిని సర్‌ప్రైజ్ చేశారు. హౌజ్‌మేట్స్‌లో మంచి జోష్ నింపారు. ఇక నాగ్ హౌజ్‌లోని ప్రతీ కంటెస్టెంట్ గురించి రామ్ చరణ్‌కు చెబుతోన్న తీరు నవ్వు తెప్పించింది. ఈ క్రమంలో రామ్ చరణ్ వారితో ఉన్న అనుబంధాన్ని గురించి కూడా గుర్తు చేసుకున్నారు. చరణ్ నాగార్జున మధ్య జరిగిన సంభాషణ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
అనంతరం నాగ్ బిగ్ బాస్ స్టేజ్‌ను రామ్ చరణ్ కి అప్పగించి వెళ్లిపోయారు. దీంతో రామ్ చరణ్ కొంతసేపు హోస్ట్ గా కూడా వ్యవహరించారు. మాస్ట్రో చిత్ర యూనిట్ ని స్టేజిపైకి పిలిచిన ఆ చిత్రం గురించి అడిగి తెలుసుకున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమాను అందరూ తప్పకుండా చూడాలని ప్రమోట్ చేశారు. చివరిగా మాస్ట్రో టైటిల్ సాంగ్ కు స్టెప్పులు చేసి పుల్ ఎంటర్టైన్ చేశారు. ఆయన షో కే ప్రత్యేక అట్రాక్షన్‌గా నిలిచారని ప్రేక్షకుల అంటున్నారు.
ఇలా.. రామ్ చరణ్ బిగ్ బాస్ స్టేజ్‌పై కనిపించి కనుల విందు చేయడంతో నెక్ట్ హోస్ట్‌గా ఆయనే కనిపించనున్నారనే వార్తలు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ తన నటనతో దూసుకపోతున్న మెగా హీరో.. తనకంటూ ఓ స్పెషల్ మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నారు. ఇప్పటికే పలు యాడ్స్ లో నటిస్తు మంచి ఇమేజ్ తెచ్చుకున్నారు. దీనికి తోడు ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కు బ్రాండ్ అంబసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ హోదా కూడా ఆయనను హోస్ట్ గా చేసే అవకాశమున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలుసుకోవాలంటే నెక్ట్స్ సీజన్ వరకు వేచి చూడాల్సిందే!.