ఏపీ ఫైబర్‌ నెట్‌ కేసు : హై కోర్టులో బెయిల్‌ పిటిషన్‌

-

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో ప్రస్తుతం… ఫైబర్‌ నెట్‌ కేసు.. రాజకీయాలను వేడెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు లో నిన్న సాంబశివరావు ను సీఐడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఫైబర్‌ నెట్‌ స్కాం లో పలు ఆరోపణలు ఉన్న నేపథ్యం లో అరెస్ట్‌ చేశారు సీఐడీ అధికారులు. అయితే.. ఈ కేసులో తాజాగా మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ ధాఖలు అయ్యాయి. ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ లో నిందితుడు సాంబశివరావు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

అయితే.. సాంబశివరావు వేసిన హౌస్ మోషన్ పిటిషన్ ను స్వీకరించింది ఆంధ్ర ప్రదేశ్‌ హైకోర్టు. ప్రస్తుతం రాజమండ్రి జైలు లో ఉన్న IRTC అధికారి సాంబశివరావు… గత ప్రభుత్వంలో ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా విధులు నిర్వహించారు. కేంద్ర సర్వీసులో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే కేంద్రప్రభుత్వం అనుమతి తీసుకోవాలని పిటిషన్ లో పిటిషనర్ తరుపు న్యాయవాది పేర్కొన్నారు. కేసు క్వాష్ చేయాలని హైకోర్టును కోరారు పిటిషనర్ తరుపు న్యాయవాది. ఇక రేపు ఈ కేసు హైకోర్టులో విచారణకు రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version