BIGG BOSS-5 :ఛాన్సుల‌కోసం నీ వెంట‌ప‌డుతున్నానా..? ర‌విని నిల‌దీసిన ల‌హ‌రి..!

-

బిగ్ బాస్ లో నిన్న నామినేష‌న్ సంధ‌ర్బంగా ర‌చ్చ రచ్చ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ల‌హ‌రి మ‌గ‌వాళ్ల‌తోనే మాట్లాడుతుంద‌ని బాత్రూంలో ర‌విని హ‌గ్ చేసుకుంద‌ని ప్రియా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. అయితే అన్ సీన్ లో ..ర‌వితో ముందుగా ప్రియ వెళ్లి నువ్వు కుటుంబం ఉన్న‌వాడివి కాస్త జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని భ‌య‌ట‌కు వేరేలా వెళుతుంద‌ని చెప్పింది. దాంతో ర‌వి…ల‌హ‌రికి ఎలా చెప్పాలో అర్థం కావ‌డం లేద‌ని తాను యాంకర్ గా ఛాన్స్ ల కోసం త‌న‌తో క్లోజ్ గా ఉంటుంద‌ని వ్యాఖ్యానించాడు.

కాగా తాజాగా విడుద‌లైన ప్రోమోలో మ‌ళ్లీ ఇష్ష్యూ చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఛాన్సుల కోసం నీ వెంట‌ప‌డుతున్నానా అంటూ ల‌హ‌రి ర‌విని వెళ్లి నిల‌దీసింది. దానికి ర‌వి నేను అలా చెప్ప‌లేద‌ని అన్నాడు. ప్రియా నువ్వు అలానే అన్నావు బ్రో అంటూ ఏడ్చేసింది. ఇక యాంకర్ ర‌వి వెళ్లిపోయిన త‌ర‌వాత కూడా ప్రియా బాల్క‌నిలో కూర్చుని ఏడ్చుకుంటూ నేను అబ‌ద్దం చెప్ప‌లేదు అమ్మా నువ్వు నాకు ఎలా నేర్పించావో అలానే ఉన్నాను. న‌న్ను నువ్వు అర్థం చేసుకుంటే చాలు అంటూ ఏడ్చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version