Bigg Boss 5: ఏంటీ భ‌య్యా ఇది.. ఒక్కొక్క‌రి న‌ట‌న మాములుగా లేదుగా.. నామినేషన్స్‏లో రెచ్చిపోయిన లోబో

-

Bigg Boss 5: బిగ్ బాస్ సీజన్ 5 రసవత్తరంగా కొన‌సాగుతోంది. కావాల్సినంత వినోదాన్ని పంచుతూ.. ప్రేక్ష‌కుల‌ను పుల్ ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తుంది. వారం మొత్తం ఎంతో స‌రదాగా ఉంటే కంటెస్టెంట్లు.. నామినేష‌న్స్ నాడు మాత్రం ఒకరిపై ఒకరు నిందించుకుంటూ బ‌ద్ద శ‌త్రువులుగా మారుతున్నారు. త‌మ ప్ర‌తాప‌న్ని చూపిస్తూ.. వారి విశ్వ‌రూపాన్ని చూపిస్తున్నారు. మొత్తానికి నామినేష‌న్స్ నాడు మాత్రం కంటెస్టెంట్లు సైకోలుగా మారి.. హౌస్ లో హీట్ పుట్టిస్తున్నారు. ఇంటిని రణరంగంగా మారుస్తున్నారు. సోమ‌వారం జ‌రిగిన నామినేష‌న్ ప్ర‌క్రియ కు ఓ రేంజ్‌లో జ‌రిగింది. ఒక్కో కంటెస్టెంట్స్ త‌మ విశ్వ‌రూపాన్ని చూపించారు. ఇందులో ముఖ్యంగా లోబో సైకోగా మారి ప్రియపై మండి పడ్డాడు. అస‌భ్యక‌ర ప‌దజాలంతో విరుచుక‌ప‌డ్డాడు.

నామినేష‌న్స్ అంటే షోలో హీట్ పుడుతుంది. సోమవారం తొలుత నామినేషన్స్ ప్రారంభించింది ప్రియ‌.
తనతో సన్నీ, లోబో లు సరిగ్గా మాట్లాడడం లేదంటూ వారిద్ద‌రిని నామినేట్ చేసింది. ఆ మాటాలు నిప్పు రాజేసిన‌ట్టు అయ్యాయి. ఇక ఆ తర్వాత వచ్చిన లోబో రెచ్చిపోయాడు. ప్రియను నామినేట్ చేస్తూ.. విరుచుక‌ప‌డ్డాడు. తాను ఓ అమ్మాయిని ప్రేమించానని చెపితే.. సినిమా స్టోరీలా ఉందనని హేళ‌న చేసింద‌ని అన్నారు. ఆమె మాటల‌తో నా ఖలేజా పగిలిపోయింది. నన్ను తిట్టు, చెప్పుతో కొట్టు ప‌డుతా.. కానీ అలా మాట్లాడం బాగాలేద‌ని ప్రియ‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు.

అలా త‌ప్పుగా అర్థం చేసుకోకు అని ప్రియ చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించినా.. లోబో త‌గ్గ‌లేదు.. అస‌భ్య‌క‌రంగా మాట్లాడుతూ.. అరుస్తూ.. ప్రియ‌పైకి దూసుకెళ్లాడు. సోకోలా మారి త‌న విశ్వరూపం చూపించాడు. ఈ స‌మ‌యంలో లోబోను రవి ఆప‌డానికి ప్ర‌య‌త్నించినా.. ఏ మాత్రం త‌గ్గ‌లేదు. నా లవ్ మ్యాటర్ నీకు తెలుసు కదరా అంటూ ర‌వి మీద ప‌డి ఏడ్చేసాడు లోబో.. లోబో సోకో ప్ర‌వ‌ర్త‌న‌కు ప్రియ షాకయ్యింది. ఏం మాట్లాడాలో తెలియక.. సైలెంట్ గా ఉండిపోయింది.

లోప‌ల ఒకటి పెట్టుకుని.. బ‌య‌ట‌ మరొకటి మాట్లాడకు లోబో అంటూ సిరీయ‌స్ అయ్యింది. రవితో తనకు గొడవ అయిన కారణంగానే.. లోబో తనతో మాట్లాడటం మానేశాడని చెప్పుకొచ్చింది. నాది టైంపాస్ ప్రేమ‌ కాదు.. అమ్మాయికి గౌరవమిచ్చా.. లోబో అంటుంటే.. తెలుస్తుంది.. నువ్వు అమ్మాయిలకు ఎంత గౌరవమిస్తావో తెలుస్తుంద‌ని అంటూ ఎదురు స‌మాధానమిచ్చింది ప్రియ. జనాలవల్లే తాను ఇక్కడ ఉన్నానని.. చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. లోబో సోకో ప్రవర్తన చూసిన ప్రియ తెగ ఏడ్చేసింది. మొత్తం మీద‌.. ఈ వారం నామినేషన్స్ లో లోబో శ్రుతి మించిపోయింద‌నే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version