బిగ్ బాస్ 6 లోకి కంటెస్ట్ గా వచ్చిన ఆరోహీ ప్రస్తుతం హౌస్ లో యాక్టివ్ గా ఉంటూ అందరితో కలగలుపుకుపోతూ ఉంటుంది. తెలంగాణ యాసలో అందరినీ రఫ్ఫాడించేస్తోంది. నిజానికి తెలంగాణ పరకాలలోని కనపర్తి అనే మారుమూల గ్రామంలో పుట్టి పెరిగిన అంజలి చిన్నతరణంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో అమ్మమ్మ దగ్గర చదివింది. ఇక చదువు తర్వాత వరంగల్ వచ్చి ఎంబీఏ పూర్తి చేసి ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి అవకాశాల కోసం వెతుకుతున్న సమయంలో ఆరోహీ రావ్ గా తన పేరును మార్చుకుంది. ఇక స్టూడియో ఎన్ లో యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఆరోహి జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంది.. జీవితంలో తల్లి , తండ్రిని కోల్పోయి అమ్మమ్మ దగ్గరే పెరిగాను అంటూ అంతే కాదు తాను కూడా ఎన్నో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను అని చెప్తూ మరింత ఎమోషనల్ అయింది.
మామూలుగా ఆడపిల్ల అనేసరికి కొంతమంది ఎలా వాడేద్దామా.. అని తప్పుగా చూస్తారు ..కానీ వెనుక ఎవరూ లేరు అనేసరికి ఇంకా గట్టిగా ట్రైల్స్ వేస్తారు.. బాణం గట్టిగా వేద్దాం దిగితే దిగింది లేదంటే లేదు అన్నట్టుగా చూస్తారు ..నన్ను కూడా అలాగే చాలా సెక్సువల్ వేధింపులకు గురి చేశారు. రేప్ అటెంప్ట్ కూడా చేశారు. దానికి నేను బాధపడ్డాను అని కూడా చెప్పుకోలేను ..ఎందుకంటే నాకు అంత వయసు లేదు.. అప్పుడు నా చుట్టూ ఏం జరుగుతుంది.. నాకు ఏమైంది.. అన్నది కూడా తెలియదు.. ఒక ఏజ్ వచ్చిన తర్వాత నాకు అలా జరిగిందని తెలుసుకున్నాను.
ఇక అలాంటి అనుభవాల వల్లే నాకు మగాడు దగ్గరికి వెళ్లాలంటే భయం.. తెలియని కోపం.. ఎవరితో మాట్లాడినా నాకు అనుమానం.. ఒకరు చేసిన తప్పుకు 90 మందిని నిందించడం కరెక్ట్ కాదని రియలైజ్ అయ్యాను. ఇకపోతే రిలేషన్షిప్ గురించి కూడా నాకు పెద్దగా తెలియదు. ఇకపోతే మా ఊర్లో మా బంధువు ఉండేవాడు.. బాబాయి అవుతాడు కానీ నేను అన్న అనేదాన్ని.. నన్ను పట్టుకోని అటు ఇటు తోసేస్తుంటే కొడుతున్నాడేమో అనుకున్నాను.. అన్నా నన్ను ఎందుకు కొడుతున్నావ్ అని అరుస్తూ అరిచి పరుగు పెట్టే సరికి వదిలేసాడు.. చాలా భయపడిపోయాను. ఒక ఏజ్ వచ్చిన తర్వాత రేప్ అటెంప్ట్ చేశాడు. ఆ తర్వాత నుంచి నేను రెబెల్ గా మారాను. ఇక ఎవడికి భయపడేది లేదు అంటూ తాను ధైర్యంగా చెప్పుకొచ్చింది.