Bigg Boss Telugu 5: స‌న్నీని పొగ‌డ్త‌ల‌తో ముంచేసిన మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్

-

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ సీజన్ 5 రోజు రోజుకు మరింత ఆసక్తిగా మారుతోంది వారానికి ఒకరోజు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతున్నారు దీంతో బలమైన కంటెస్టెంట్స్ ఎవరు అనే విషయంలో మరింత ఆసక్తి నెలకొంది. ఈ క్ర‌మంలో బిగ్ బాస్ హౌస్లో జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌లు చూస్తూంటే.. చాలా హృద‌యవిదారంగా ఉన్నాయి. ముఖ్యంగా స‌న్నీ టార్గెట్ చేసి.. ఎమోష‌న‌ల్ గా ఆడుకుంటున్నారు హౌస్ మేట్స్ అంద‌రూ. న్న జ‌రిగిన స్విమ్మింగ్ పూల్ టాస్కులో స‌న్నీని కార్న‌ర్ చేశాడు సంచాల‌క్ రవి. ర‌విని అన్ ఫేర్ గేమ్ ఆడి.. స‌న్నీని బ‌లి చేశారు. గేమ్ మ‌ధ్య‌లో స‌న్నీకి కొత్త రూల్స్ పెట్టి ఓడిపోయాలా చేశారు. త‌నకు ఎమోష‌న‌ల్ గా రెచ్చ‌గొట్టి.. ఒంట‌రిని చేశారు. మొత్తం మీద త‌న‌ను అనాయ్యంగా ఓడిచారు ర‌వి అండ్ కో.

ఈ ఘ‌ట‌న‌పై స్పందించారు మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్. స‌న్నీకి త‌న మ‌ద్ద‌తు తెలిపారు. స‌న్నీ ని ఇలా ఒంట‌రి చేయడం స‌రికాద‌నీ, ర‌వి వ్య‌వ‌హ‌రించిన తీరు ఏ మాత్రం న‌చ్చ‌లేదంటూ మండి ప‌డ్డారు విశ్వ‌క్ సేన్. అన్ ఫేర్ గేమ్ ఫాపం అంటూ స‌న్నీ కి త‌న మ‌ద్ద‌తు నిలబ‌డ్డారు. స‌న్నీ.. నీకు నా స‌పోర్టు ఉంటుంది. స‌న్నీ నెంబ‌ర్ ను సేవ్ చేసి.. అంద‌రూ స‌న్నీకి ఓటింగ్ చేయాలంటూ ప్ర‌చారం చేస్తున్నారు ప‌గ‌ల్ హీరో.
స‌న్నీ నీ లాంటి వాళ్ల‌కు ఈ హౌస్ క‌ర్టెక్ కాద‌నీ, నువ్వు బ‌య‌ట‌కు వ‌చ్చినా.. మా అభిమానం అలాగే ఉంటూ ప్ర‌క‌టించారు.

నిజంగా స్విమ్మింగ్ పుల్ టాస్క్లో త‌న న‌మ్మిన ఫ్రేండ్స్ ఇద్ద‌రూ కాజ‌ల్ గానీ, మాన‌స్ గానీ స‌పోర్టు లేక‌పోవ‌డంతో చాలా బాధ‌ప‌డ్డారు స‌న్నీ. నెట్టింట్లో కూడా స‌న్నీకి మద్దుతు పెరిగింది. రవి కావాలనే సన్నీని టార్గెట్ చేశాడని, అందుకే టాస్క్ మధ్యలో కొత్త రూల్ పెట్టాడ‌ని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సన్నీ ఫ్యాన్స్ ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ని తెగ షేర్లు చేస్తున్నారు. అంతేకాదు, ర‌వి, ష‌న్నూ, సిరిలు క‌లిసి గేమ్ మ‌ధ్య‌లో కొత్త రూల్స్ పెట్టార‌ని కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news