BIGGBOSS : క‌మ‌ల్ హాస‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. బిగ్ బాస్‌కు గుడ్ బై

-

బిగ్ బాస్.. తెలుగులోనే కాకుండా.. త‌మిళ, హింది తో పాటు చాలా భాషల‌ల్లో అందుబాటు ఉంటుంది. ఈ రియాల్టీ షో ద్వారా చాలా మంది న‌టీ న‌టుల‌కు మంచి గుర్తింపు వ‌చ్చింది. సినిమా అవ‌కాశాలు కూడా వ‌చ్చాయి. అయితే తెలుగు లో బిగ్ బాస్ షోకు ఇప్ప‌టి వ‌ర‌కు చాలా మంది హోస్టు లు మారారు. కానీ త‌మిళ బిగ్ బాస్ కు మాత్రం చాలా రోజుల నుంచి క‌మ‌ల్ హాస‌న్ ఉంటున్నారు. ఇటీవ‌ల త‌మిళ‌ల్లోనూ బిగ్ బాస్ ఓటీటీని నిర్వ‌హిస్తున్నారు.

బిగ్ బాస్ ఓటీటీ కి బిగ్ బాస్ అల్టి మేట్ షో అని నామ‌క‌ర‌ణం కూడా చేశారు. దీనికి కూడా క‌మ‌ల్ హాస‌న్ హోస్టుగా చేస్తున్నారు. అయితే తాజా గా కమ‌ల్ హాస‌న్ సంచ‌ల‌న‌ నిర్ణ‌యం తీసుకున్నారు. తాను బిగ్ బాస్ షో నుంచి త‌ప్పుకుంటున్నాన‌ని తెలిపారు. ఇక ముందు వ‌చ్చే ఎపిసోడ్ల‌కు తాను అందుబాటు లో ఉండ‌న‌ని క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌క‌టించారు. కాగ క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో విక్ర‌మ్ అనే సినిమా చేస్తున్నారు.

ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి కమ‌ల్ హాస‌న్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల అయింది. భారీ అంచ‌నాల‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. కాగ విక్ర‌మ్ సినిమాకు బిగ్ బాస్ కు డేట్స్ అడ్జెస్ట్ కాక‌పోవ‌డంతోనే బిగ్ బాస్ కు క‌మ‌ల్ హ‌స‌న్ దూరం అయ్యాడ‌ని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version