ఈ మధ్య కాలంలో ప్రేమోన్మాదులు రెచ్చి పోతున్నారు. కొందరూ ప్రేమ పేరుతో పెల్లి అయిన మహిళలను మభ్య పెట్టి వారి కుటుంబాన్ని నాశనం చేస్తున్నారు. మరికొందరూ ప్రేమ పేరుతో మోసం చేస్తున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అమ్మాయిలను వలలో వేసుకొని తీరా మరొకరిని పెళ్లి చేసుకోవడం ఇలాంటి ఘటనలు నిత్యం చోటు చేసుకుంటున్నాయి.
కరీంనగర్ జిల్లాలో ప్రేమోన్మాది దారుణం సృష్టించాడు. తమ ప్రేమకు అడొస్తుందనే కారణంగా ప్రియురాలి తల్లి చామంతి పై దాడి చేసి గొంతు పిసికి చంపడానికి ప్రయత్నం చేశాడు ప్రేమోన్మాది. స్థానికులు అడ్డుకోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడిన బాధితురాలు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. రాజ్ కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు.