నాగర్జున హోస్ట్ గా ఈ ఏడాది వస్తున్న బిగ్ బాస్ సిజన్ 5 కు చాలా మంది అభిమానులు ఉన్నారు. అయితే బిగ్ బాస్ సిజన్ 5 రోజు రోజు ఉత్కంఠ గా మారుతుంది. ఎప్పుడు ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారా అనే ప్రశ్న ప్రతి అభిమాని లో కలుగుతుంది. అయితే ఈ సిజన్ లో ఇప్పటి వరకు 9 మంది కంటెస్టట్స్ ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈ వారం 10 కంటెస్టట్ ఎలిమినేట్ కాబోతున్నారు. అయితే ఈ వారం ఆర్ జే కాజల్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతున్నట్టు సమాచారం.
ఈ వారం నామినేషన్స్ లో ఆర్ జే కాజల్ తో పాటు రవి, సిరి, సన్ని, మానస్ లు ఉన్నారు. అయితే ముందుగా నామినేషన్స్ లో రవి, సిరి, సన్ని, మానస్ లు మాత్రమే ఉండేవారు. కానీ హౌస్ కెప్టెన్ అయిన ఆనీ మాస్టర్ కు బిగ్ బాస్ సూపర్ పవర్ ఇచ్చాడు. ఆ పవర్ ప్రకారం హౌస్ లో ఎవరిని అయినా ఒక్కరిని డైరెక్ట్ గా నామినేట్ చేయవచ్చు. దీంతో ఆనీ మాస్టర్ ఆలోచించ కుండా ఆర్ జే కాజల్ పేరు చేప్పింది. దీంతో ఆర్ జే కాజల్ కూడా ఎలిమినేషన్ లోకి వచ్చింది. అయితే నామినేషన్ లో ఉన్న రవి కి ఫాలోయింగ్ ఉంది కాబట్టి మంచి ఓట్లు వస్తున్నాయి. అలాగే షణ్ముక్ నామినేషన్ లో లేక పోవడం తో షణ్ముక్ ఫ్రెండ్ సిరి కి ఓట్లు పడుతున్నాయి.
అలాగే సన్నీ కూడా ఓట్లతో దూసుకుపోతున్నాడు. అయితే మానస్, ఆర్ జే కాజల్ డేంజర్ జోన్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే మానస్ టాస్క్ లలో మంచి ఫార్మమెన్స్ ఉంటుంది కాబట్టి మానస్ కూడా ఓట్లు ఎక్కువ గా పడుతున్నాయి. దీంతో ఆర్ జే కాజల్ కు ఓట్లు వీరి కంటే కాస్త తక్కువగా పడుతున్నట్టు తెలుస్తుంది. దీంతో ఈ వారం ఎలిమినేషన్ గండం నుంచి ఆర్ జే కాజల్ బయట పడటం కాస్త కష్టం గానే అనిపిస్తుంది.
అయితే జెస్సీ కూడా హౌస్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. గత కొద్ది రోజుల నుంచి జెస్సీ ఆరోగ్యం బాగ ఉండటం లేదు. జెస్సీ కి తల తిరిగే వ్యాధి ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ వ్యాధి తోనే జెస్సీ ఇబ్బంది పడుతున్నాడని సమాచారం. దీంతో ఈ వారం ఎలిమినేషన్స్ లేకుండా ఆనారోగ్యం తో జెస్సీ ని బయటకు పంపించే అవకాశం ఉంది.