Bigg Boss 8 Telugu : కరీంనగర్ రైతు బిడ్డ.. కరాటే ఫైటర్.. సోనియా బ్యాగ్రౌండ్ తెలుసా..?

-

Bigg Boss 8 Telugu : బిగ్బాస్ 8వ సీజన్లో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఏడుగురు ఇందులో అమ్మాయిలు. మరో ఏడుగురు అబ్బాయిలు. మొత్తంగా చూస్తే ఈ సీజన్లో తెలిసిన ముఖాలు పెద్దగా లేవు. ఈసారి కూడా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ క్యాంపు నుంచి ఒకరు వచ్చారు. తనే సోనియా ఆకుల. ఇదివరకు రాంగోపాల్ వర్మ డెన్ నుంచి అషు రెడ్డి, అరియనా, ఇనాయ సుల్తానా వచ్చారు. ఇప్పుడు సోనియా వచ్చింది. తెలంగాణకు చెందిన సోనియా ఆకుల బ్యాగ్రౌండ్ గురించి నెట్టింట వైరల్ అవుతోంది.

ఈమె మంథని ప్రాంతానికి చెందిన ఆమె. సోషల్ వర్కర్ కూడా. బిగ్బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన సోనియా తాను కరాటే ఫైటర్ అని చెప్పి హోస్ట్ నాగార్జునతో పాటు అందరినీ షాక్ అయ్యే విధంగా చేసింది. రాంగోపాల్ వర్మ కరోనా వైరస్, ఆశ, ఎన్ కౌంటర్ సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది. జార్జి రెడ్డి మూవీ లో హీరో చెల్లి పాత్ర చేసింది. సోషల్ మీడియాలో కూడా సోనియాకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

ఆమె నెట్టింటే షేర్ చేసే ఫోటోలకు భారీగానే లైక్స్ వస్తూ ఉంటాయి. మరి బిగ్ బాస్ హౌస్ లో సోనియా ఎన్ని వారాలు మెప్పిస్తుందనేదే చూడాలి. సోనియాకి ఆడియన్స్ నుంచి మంచి మార్కులు పడితే కచ్చితంగా ఎక్కువ వారాలు ఆడుతూ అందరిని మెప్పిస్తుంది. అదే ఒకవేళ ఆమె ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేకపోతే త్వరగా వచ్చేయాల్సి ఉంటుంది మరి సోనియా ఎలాంటి స్ట్రేటజీతో మెప్పిస్తుంది అనేది చూడాల్సి ఉంది

Read more RELATED
Recommended to you

Exit mobile version