ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజు రోజుకు చాలా రసవత్తరంగా మారుతున్నాయి. ఎప్పుడూ ఎవ్వరూ ఏ పార్టీలోకి వెళ్తున్నారో తెలియడం లేదు. ప్రజలు అయితే ఆశ్చర్యపోతున్నారు. కొంత మంది అధికార టీడీపీ పార్టీలోకి వెళ్లితే.. మరికొందరూ వైసీపీలోకి.. ఇంకొందరూ వైసీపీ నుంచి బీజేపీ, జనసేన వంటి పార్టీలోకి ఇలా వలసలు వెళ్తున్నారు. తాజాగా పుంగనూరులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
నిన్న, మొన్న వైసీపీకి చెందిన పుంగనూరు మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్లు వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లారు. మళ్లీ తాజాగా టీడీపీ నుంచి వైసీపీ లోకి వెళ్లడం గమనార్హం.పుంగనూరు మున్సిపల్ చైర్మన్, పలువురు కౌన్సిలర్లు సొంత గూటికి వెళ్లారు. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ప్రజా సమస్యలను గాలికొదిలి బాబు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మీడియాతో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేర్కొన్నారు. ఫైళ్లు కాలి పోయాయని హెలికాప్టర్ లో డీజీపీని మదనపల్లికి పంపించారు. ఇప్పుడు వరద బాధితులను కాపాడేందుకు హెలికాప్టర్ ను ఎందుకు వాడలేదు అని ప్రవ్నించారు మిథున్ రెడ్డి.