మహేష్ బాబుకు తొలిసారి అతిపెద్ద అగ్ని పరీక్ష….!!

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు పై సూపర్ స్టార్ ఫ్యాన్స్ సహా టాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ తరువాత ఆ అంచనాలు మరింత తారా స్థాయికి చేరాయి అనే చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా ద్వారా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి టాలీవుడ్ కి చాలా గ్యాప్ తరువాత నటిగా రీఎంట్రీ ఇస్తున్నారు.

రష్మిక మందన్న తొలిసారి మహేష్ ప్రక్కన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, మురళి శర్మ, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, సంగీత, బండ్ల గణేష్, శ్రీనివాసరెడ్డి, హరితేజ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ఒకరకంగా మహేష్ బాబుకు అతి పెద్ద అగ్ని పరీక్షే అని అంటున్నారు సినీ విశ్లేషకులు. దానికి కారణం, కెరీర్ పరంగా ఇప్పటివరకు 25 సినిమాల్లో నటించిన మహేష్ బాబు, ఇప్పటివరకు వరుసగా హ్యాట్రిక్ విజయాలు మాత్రం అందుకోవడం జరగలేదు. అయితే ఇటీవల కొరటాల దర్శకత్వంలో ఆయన నటించిన భరత్ అనే నేను, అలానే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించిన మహర్షి సినిమాలు రెండూ కూడా అతి పెద్ద విజయాలు అందుకున్నాయి.

 

కాగా ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా సక్సెస్ సాధిస్తే, తొలిసారి కెరీర్లో ఆయన హ్యాట్రిక్ విజయాలు అందుకున్నట్లే అంటున్నారు విశ్లేషకులు. ఈ విషయమై సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం తప్పకుండా మహేష్ హ్యాట్రిక్ కొడతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి సంక్రాంతి కానుకగా 2020 జనవరి 11న ఎంతో క్రేజ్ తో భారీగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎంతవరకు ఈ ఫీట్ ని అందుకుంటుందో చూడాలి. కాగా ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా, రత్నవేలు ఫోటోగ్రఫిని అందిస్తున్నారు……!!

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version