హ్యాపీ బ‌ర్త్ డే ప్ర‌కాశ్ రాజ్  :  ఆకాశ‌మంత నాన్న‌కు..

-

జీవితాన్ని రంగుల‌కు ఇచ్చి
క‌ల‌ల‌కు ఇచ్చి క‌ల‌ల సాకారం ఒక‌టి మ‌రిచిపోవ‌డం
చేయాల్సిన ప‌ని అని అనుకుంటున్నారు కొంద‌రు

వీధిలో ఆడ‌బిడ్డ‌ల ప్రేమ..వీధిలో బాధ్య‌త లేని తండ్రుల ప్రేమ..చూశాక వీధిని వెలివేయ‌క త‌ప్ప‌డం లేదు..మ‌నుషుల‌ను వెలివేయ‌డంలో బాధ్య‌త ఉందా? మ‌నుషుల ప్రేమ పొంద‌డంలో ముంద‌రి సుకృతం ఒక‌టి దాగి ఉంది..నేను సుకృతాన్నే ప్రేమిస్తాను.. వీరి త‌ప్పుల‌ను చూసి న‌వ్వులు చిందిస్తాను..మంచి నాన్న అంటే..ప్ర‌పంచాన్ని ప‌ట్టి ఇవ్వ‌డం కాదు..తానే ఓ ప్ర‌పంచం కావ‌డం..

రెక్క‌లు తానే అంటే న‌వ్వుతాడు
ఏంటండీ క‌న్నీళ్లొస్తే త‌ప్పుకోవాలా

అని ఎదురు ప్ర‌శ్నిస్తాడు

ఒంట‌రిగా ఉండిపోవ‌డంలో స‌మ‌ర్థ‌త‌కు అర్థం లేదు..అర్థ‌వంతం అయిన జీవితాన్ని నిర్మించ‌డంలో నాన్న త‌ప్పుకు తిరిగితే కోప్ప‌డ‌తాడు..అమ్మానాన్నా జీవితంలో చెర‌గ‌ని స్వ‌ప్నాలు కాదు చెద‌ర‌ని స్వ‌ప్నాలు..స్వ‌ప్నాల అప్ప‌గింత జీవిత‌మా? క‌నుక రంగులు ఇవ్వండి బాధ్య‌త‌తో.. మీ క‌ల‌ల‌కు

“ఈ హోలీ రోజున బిడ్డ‌ల‌కు
ఏం చెప్పాలో అర్థం కావ‌డం లేదు
నాన్నా సంస్కృతి అంటే? ”

ఓ చోట ఇలా రాశారు ప్ర‌కాశ్ రాజ్ త‌న బిడ్డ‌ల‌ను ఉద్దేశిస్తూ….విస్త‌రించిన ప‌దాల్లో ప్రపంచాన్ని కుదించ‌డం అని అంటాను.. విస్మ‌రించ‌ద‌గ్గ వాటిని ఎంపిక చేసుకోవ‌డం అని కూడా నిర్వ‌చిస్తాను.మీ బిడ్డ‌ల‌కు ఏం నేర్పుతున్నారు. ద్వేషం ఒక‌టి దాచి ప్రేమ‌ను పంచడంలోనే అర్థం ఉంది అన‌ర్గ‌ళ త‌త్వం ఉంది.. వాంగ్మ‌య సృష్టి ఇలానే కొన‌సాగాలి. చేయాలి.. కానీ మ‌నం చేస్తున్నామా.. నాన్నా! నీవెక్క‌డ అమ్మా! మీరెక్క‌డ ఈ ఉద‌యం మీకు వంద‌నాలు చెల్లిస్తూ..హ్యాపీ బ‌ర్త్ డే ప్ర‌కాశ్ రై కాదు ప్ర‌కాశ్ రాజ్ ఆజ్ కా రాజ్ ప్ర‌కాశ్ రాజ్…

– ఆర్ట్ : గిరిధ‌ర్ అర‌స‌వ‌ల్లి

-శుభాకాంక్ష‌ల‌తో..శంభుమ‌హంతి

  

Read more RELATED
Recommended to you

Exit mobile version