దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలై రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఒక్క రోజులోనే ‘బాహుబలి’ రికార్డ్స్ ను బీట్ చేసిన ఫిల్మ్.. అతి తక్కువ టైంలోనే వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోతుందని సినీ పరిశీలకులు, అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని చూసేందుకు సామాన్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు పోటెత్తుతున్నారు.
ఇప్పటికే పలువురు పిక్చర్ చూసి సోషల్ మీడియా వేదికగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ యూనిట్ సభ్యులకు కంగ్రాట్స్ చెప్తున్నారు. ఈ క్రమంలోనే మౌత్ టు మౌత్ పబ్లిసిటీ, రివ్యూలు చూసిన జనాలు ఈ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్ల వద్ద బారులు తీరుతున్నారు. థియేటర్ యాజమాన్యం టికెట్లు ఎప్పుడు ఇస్తుందా అని వేచి చూస్తున్నారు. థియేటర్ గేట్ల వద్ద, కౌంటర్ వద్ద క్యూ లైన్ లో నిలబడి వెయిటింగ్‌లో ఉంటున్నారు. ఈ పరిస్థితి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఉందని అభిమానులు చెప్తున్నారు.
మహారాష్ట్ర స్టేట్‌లోని మలెగాన్ ప్రాంతంలోని ఓ థియేటర్ వద్ద జనం టికెట్ల కోసం క్యూలైన్‌లో జనం నిలబడ్డారు. వందల మంది అలా టికెట్లు కోసం బారులు తీరడం చూస్తుంటే థియేటర్లు ఇక కళకళలాడుతున్నాయనే అభిప్రాయానికి రావచ్చని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలా టికెట్ల కోసం ప్రజలు టాకీసుల వద్ద గుమిగూడటం చాలా కాలం తర్వాత జరుగుతున్నదని అభిమానులు చెప్తున్నారను.
ఇందుకు సంబంధించిన వీడియో రికార్డు చేసి ట్విట్టర్ వేదికగా ఓ యూజర్ షేర్ చేయగా, అది నెట్టింట తెగ వైరలవుతోంది. ఇకపోతే ఈ సినిమాను చూసి పలువురు దిగ్దర్శకులు కొనియాడుతున్నారు. ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ రాజమౌళికి హ్యాట్సాఫ్ చెప్తున్నట్లు పేర్కొన్నారు. ‘పుష్ప’రాజ్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా వేరే లెవల్ లో ఉందని, హీరోలిరువురు సూపర్బ్ గా పర్ఫార్మ్ చేశారని సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెప్పారు.
#RRR StoRRRm IN Malegaon, Maharrrrashtrrra@ssrajamouli @tarak9999 @RRRMovie @AlwaysRamCharan pic.twitter.com/DB5hqMqix5
— KKRRR (@SRKkrIPL) March 25, 2022