సౌత్ లో విలన్ గా బాలీవుడ్ హీరో బిజిబిజీ.. NBK 109లో బాబీ దియోల్

-

బాలీవుడ్ హీరో బాబీ దియోల్ తన సెకండ్ ఇన్నింగ్స్లో దూసుకెళ్తున్నాడు. అయితే సెకండ్ ఇన్నింగ్స్లో హీరోగా కాకుండా విలన్గా సత్తా చాటుతున్నాడు. స్టైలిష్ విలన్గా, వైలెంట్ విలన్గా దూసుకెళ్తాడు. బాలీవుడ్లోనే కాదు బాబీ సౌత్ ఇండస్ట్రీలోనూ ప్రతినాయకుడిగా రాణిస్తున్నాడు. ఇటీవలే యానిమల్ తెలుగు డబ్బింగ్ మూవీలో విలన్గా బాబీకి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక ఈ సినిమా తర్వాత బాబీకి సౌత్ ఇండస్ట్రీ నుంచి వరుస అవకాశాలు వస్తున్నాయి.

ఓవైపు తమిళ్లో సూర్య హీరోగా నటిస్తున్న కంగువా సినిమాలో బాబీ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా టాలీవుడ్లో నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘NBK 109’లో బాబీ విలన్గా కనిపించనున్నాడు. డైరెక్టర్‌ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్యను ఢీ కొట్టే విలన్గా ‘యానిమల్‌’ స్టార్ను రంగంలోకి దింపినట్లు మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈ చిత్రంలో బాబీ దియోల్ నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. ఈ అప్డేట్ చూసిన నందమూరి ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news