నేను 2024 ఎన్నికల్లో పోటీ చేయడం లేదు – ఎంపీ గల్లా జయదేవ్

-

 

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్. నేను 2024 ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు. ఇక తన కుటుంబాన్ని చూసుకుంటానన్నారు. ఇవాళ గుంటూరులో మీడియాతో గల్లా జయదేవ్ మాట్లాడుతూ…నాకు రాజకీయంగా అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు రుణపడి ఉంటానన్నారు. ఎంపీ గా రెండు సార్లు గెలిపించిన గుంటూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

Jayadev Galla key statement on politics

చివరి మూడు సంవత్సరాలుగా నేను క్షేత్ర స్థాయిలో అందుబాటులో లేను…కానీ పార్లమెంట్ లో గుంటూరు ప్రజలకు ఏం చేయాలో అవి చేస్తూనే ఉన్నానని వెల్లడించారు. మా తాత రాజగోపాల్ నాయుడు వారసత్వంగా ప్రజా సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ప్రజాస్వామ్యం లో కొన్ని వ్యవస్థలు, ఫుల్ టైం కొన్ని వ్యవస్థలు పార్ట్ టైం పని చేస్తాయని చెప్పారు.

పార్లమెంట్ లో కేవలం 24 శాతమే పూర్తి స్థాయిలో పని చేసే పార్లమెంట్ సభ్యులు ఉన్నారన్నారు. మిగిలిన వారు ఏదో ఒక రంగం లో కొనసాగుతూ రాజకీయాలు చేస్తున్నారు…బిజినెస్ మన్ గా నాకు ఉన్న నాలెడ్జ్ ప్రజల కోసం ఉపయోగించాలని అనుకున్నానని తెలిపారు. పదేళ్ల నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉన్నాం…కానీ ప్రయోజనం లేదన్నారు. ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news