సినిమా ఇండస్ట్రీలో ఇటీవల విడాకుల పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇటీవలే పలువురు నటీనటులు తమ భాగస్వాములతో విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటి ఈషా డియోల్ తన భర్త నుంచి విడిపోయింది. ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు హేమమాలిని పెద్ద కూతురు ఈషా డియోల్ తన 12 ఏళ్ల వైవాహిక జీవితానికి గుడ్ బై చెబుతున్నట్లు తెలిపింద
“పరస్పరం అంగీకారంతోనే భరత్ – నేను విడిపోయాం. అయితే పిల్లలు మాత్రం మాకు చాలా ముఖ్యం. భార్యభర్తలుగా విడిపోయినప్పటికీ తల్లిదండ్రులుగా వారికి ఎలాంటి ఇబ్బంది రానివ్వకుండా చూసుకుంటాం” అని ఇషా చెప్పింది. కానీ విడాకులకు గల అసలు కారణాన్ని చెప్పలేదు. ఈ విషయం తెలుసుకున్న ఇషా ఫ్యాన్స్ షాక్ అయ్యారు. స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ ఉన్న సమయంలోనే 2012లో భరత్ తక్తానీని ఈషా పెళ్లాడింది. ఆ తర్వాత ఇద్దరు పిల్లలకు తల్లై యాక్టింగ్‌కు బ్రేక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత తన భర్త భరత్ తో విడిపోయింది ఈషా.