బీఆర్ఎస్ కు షాక్… చలో నల్లగొండ సభకు పోటీగా కాంగ్రెస్ సభ కూడా ఉండనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటన చేశారట. బీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించ బోతున్న చలో నల్లగొండ సభకు కౌంటర్ గా 2 లక్షల మందితో కాంగ్రెస్ పార్టీ సభ పెడదామని ప్రతిపాదించార కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. రేవంత్ రెడ్డి సైతం సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం అందుతోంది.
ఇది ఇలా ఉండగా ఎన్ని అడ్డంకులు సృష్టించినా నల్గొండలో ఈనెల 13న భారీ బహిరంగ సభ నిర్వహించి తీరుతామని మాజీ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మంగళవారం పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో మాట్లాడారు కేసీఆర్. కృష్ణా ప్రాజెక్టుల కోసం పోరాటం చేయాలని మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. బహిరంగ సభ నిర్వహించి.. ఉద్యమాన్ని మరింత ఉద్ధ్రుతం చేస్తామని ప్రకటించారు. కేఆర్ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టులు వెళ్లితే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు తెలివి లేదని విమర్శించారు.