పూజా హెగ్డే ఇస్తున్న ఆఫర్స్ బావున్నా బాలీవుడ్ మేకర్స్ భయపడుతున్నారే …?

-

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ఎవరంటే అందరూ ముందు చెప్పేది పూజా హెగ్డే పేరే. వరసగా ఎన్.టి.ఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్స్ నటించిన భారీ బడ్జెట్ సినిమాలలో హీరోయిన్ గా చేసి తను లక్కీ హీరోయిన్ అనిపించుకోవడమే కాదు స్టార్ స్టేటస్ ని అందుకుంది. అంతేకాదు హీరోలకి.. దర్శక, నిర్మాతలకి ప్రాజెక్ట్ అనుకుంటే ముందే పూజా హెగ్డేనే సంప్రదిస్తున్నారు. పూజా కూడా ప్రాజెక్ట్ మంచిదై కథ లో తనకి ఇంపార్టెన్స్ ఉంటే ఎలాగోలా డేట్స్ సర్దుబాటు చేస్తూ సాద్యమైనంతవరకు సినిమా వదలకోకుండా కమిటవుతుంది.

 

ఇక పర్ఫార్మెన్స్ పరంగా కూడా ఈ బ్యూటికి ఇండస్ట్రీ వర్గాల్లో గాని, తను నటించిన హీరోలు, దర్శక నిర్మాతల్లో గాని మంచి పేరుని సాధించుకుంది. అందుకే పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా చాలామణి అవుతోంది. ప్రస్తుతం పూజా హెగ్డే రెబల్ స్టార్ ప్రభాస్ సరసన తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కాకుండా మహేష్ బాబు – పరశురాం సినిమా, అలాగే త్రివిక్రం – ఎన్.టి.ఆర్ సినిమా…ప్రభాస్ – నాగ్ అశ్విన్ సినిమాలలో కూడా పూజా హెగ్డే ని అనుకుంటున్నారట. దాదాపు త్రివిక్రం – ఎన్.టి.ఆర్ సినిమాలో పూజా హెగ్డే కన్‌ఫర్మ్ అన్న మాట వినిపిస్తుంది.

 

ఇక బాలీవుడ్ లోనూ రెండు సినిమాలు కమిటయిన సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి సల్మాన్ ఖాన్ సినిమా కాగా, మరోకటి గత నాలుగేళ్ళగా వరస సక్సస్ ల మీద ఉన్న అక్షయ్ కుమార్ సినిమా కావడం విశేషం. ఈ రెండు సినిమాలకి గాను పూజా హెగ్డే అందుకుంటున్న రెమ్యూనరేషన్ దాదాపు మూడు కోట్లని సమాచారం. టాలీవుడ్ లో పూజా రెమ్యూనరేషన్ 2-2.5 కోట్ల మద్య ఉంది. అంటే బాలీవుడ్ లో కాస్త ఎక్కువే తీసుకుంటుంది. అందుకు కారణం అక్కడ మార్కెట్ పెద్దది కావడం తో పాటు సినిమాల బడ్జెట్ కూడా ఎక్కువగా ఉండటం. అయితే రీసెంట్ గా బాలీవుడ్ లో మరో ప్రజెక్ట్ కి సంప్రదించగా ఏకంగా నాలుగు కోట్ల వరకు డిమాడ్ చేసిందట.

 

అందుకు కారణం ఆ సినిమాలో కాస్త ఘాటు సన్నివేశాలు ఎక్కువగా ఉండటమే. నిర్మాత ఈ విషయం చెప్పినప్పుడు పర్వాలేదు చేస్తాను అనగానే హ్యాపీగా ఫీలయ్యాడట. అయితే తను అలా ఘాటు సన్నివేశాలలో నటించడానికి మాత్రం అదనంగా డిమాండ్ చేసిందట. దాంతో ఆ నిర్మాత డైలమాలో ఉన్నాడట. హాట్ సీన్స్, రొమాన్స్ చేయడానికి ఒకే అనడం బావుంది గాని అందుకు అదనంగా రెమ్యూనరేషన్ అనగానే బాలీవుడ్ మేకర్స్ భయపడుతున్నారట. అయితే పూజా ఇలా డిమాండ్ చేయడానికి అసలు కారణం మాత్రం ఒకప్పుడు తను నటించిన మొహంజాదారో సినిమా ఫ్లాపవడంతో ఏ మేకర్స్ మళ్ళీ ఛాన్స్ ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు తన గుడ్ టైం నడుస్తుండటంతో ఇలా డిమాండ్ చేస్తుందని బాలీవుడ్ మీడియా సమాచారం. పూజా హెగ్డే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కరెక్టే అని సమర్ధించేవాళ్ళు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version