సొంత ఓటీటీని ప్రారంభిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో షారుక్

-

బాలీవుడ్ బాద్ షా గా పేరు తెచ్చుకుని సినీ ఇండ‌స్ట్రీలో ఎన్నో రికార్డ్స్ కొల్ల‌గొట్టిన‌ షారుక్ ఖాన్.. ప్ర‌స్తుతం కరోనా కార‌ణంగా సినిమాల‌కు కాస్త దూరంగా ఉంటున్నారు. ఈ మ‌ధ్య కాలంలో ఆయ‌న సినిమాలు విడుద‌ల కూడా కాలేదు. అలాగే ఆయ‌న కుమారుడు ఆర్య‌న్ ఖాన్ డ్ర‌గ్స్ కేసులో ఉండ‌టంతో కూడా ఆయ‌న సినిమాల‌కు కాస్త బ్రేక్ ఇవ్వాల్సి వ‌చ్చింది. అయితే తాజా గా షారుక్ ఖాన్ కొత్త బిజినెస్ లోకి ఎంట్రి ఇస్తున్నాడు. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా దేశ వ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు థీయేట‌ర్స్ క‌న్నా.. ఓటీటీ ల‌కు ప్ర‌ధాన్య‌త ఇస్తున్నారు.

దీంతో ఆయ‌న సొంతంగా ఓటీటీ ప్రారంభించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. SRK + అనే పేరుతో ఓటీటీని ప్రారంభిస్తున్న‌ట్టు కూడా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ అధికారికంగా ప్ర‌క‌టించారు. ప్రేక్షకులకు అనుకూలంగా త‌న ఓటీటీని ప్రారంభిస్తాడ‌ని తెలుస్తుంది. అలాగే బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తీసుకురాబోయే.. SRK + ఓటీటీ ప్ర‌స్తుతం ఉన్న ఓటీటీల‌కు ధీటుగా, పోటీని ఇస్తూ.. ఉండేలా రూపొందుతుంద‌ని తెలుస్తుంది.

కాగ షారుక్ ఖాన్ ప్ర‌స్తుతం త‌న సినిమా ప‌ఠాన్ పై దృష్టి పెట్టాడు. ఈ సినిమాలో దీపికా ప‌దుకునె, జాన్ అబ్ర‌హం వంటి న‌టీ న‌టులు కూడా ఉన్నారు. కాగ‌ ఈ సినిమా వ‌చ్చే ఏడాది విడుద‌ల చేయ‌డానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version