నంద‌మూరి హీరోల‌ను వ‌ద‌ల‌ని బోయ‌పాటి.. ఆ హీరోతో సినిమా!

-

డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను వ‌రుస‌గా నంద‌మూరి హీరోల‌నే లైన్‌లో పెడుతున్నాడు. బోయ‌పాటి అంటేనే మాస్ సినిమాల‌కు పెట్టింది పేరు. మాస్ ఫాలోయింగ్ కోసం ఆయ‌న‌తో సినిమా చేయ‌డానికి హీరోలు ఆస‌క్తి చూపుతుంటారు. ఆయ‌న‌తో సినిమా చేస్తే మాస్ ఫ్యాన్స్ వ‌చ్చేసిన‌ట్టే అని ఫిక్స్ అయిపోతారు. ఇక నంద‌మూరి హీరోలు అంటేనే ఊర మాస్‌. మ‌రి అలాంటి వారితో బోయ‌పాటి క‌లిస్తే ఇంకెలా ఉంటుందో చెప్పండి.

ఇప్ప‌టికే బాలకృష్ణతో రెండు బంపర్‌ హిట్లు కొట్టి, తార‌క్ తో ఓ సినిమా తీశాడు బోయ‌పాటి. ఇక బాల‌కృష్ణ‌తో మూడో హిట్‌ కోసం త్వరలో ‘అఖండ’గా ప్రేక్షకుల ముందుకు వ‌స్తున్నాడు. ఇప్ప‌టికే రిలీజైన్ బాల‌య్య లుక్ విప‌రీతంగా క్రేజ్ తెచ్చుకుంది. ఇందులో మూడు పాత్ర‌ల్లో బాల‌య్య‌ను చూపించనున్నాడు బోయ‌పాటి.

మరి ఈ సినిమా తర్వాత ఎవ‌రితో చేస్తారు అనే ప్ర‌శ్న‌కు స‌మాధానం దొరికింది. మ‌ళ్లీ నంద‌మూరి హీరోతోనే ఓ సినిమా చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. కళ్యాణ్‌ రామ్ తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడ‌ట బోయ‌పాటి. క‌ల్యాణ్ రామ్ కూడా పెద్ద డైరెక్ట‌ర్ల‌తో సినిమాలు చేయ‌ట్లేదు కాబ‌ట్టి బోయ‌పాటితో చేసేందుక రెడీ అవుతున్నాడ‌ట‌. ఇప్ప‌టికే కళ్యాణ్‌ రామ్‌ కోసం బోయపాటి ఓ కథ కూడా సిద్ధం చేస్తున్నాడ‌ని తెలుస్తోంది. త‌న మాస్ ప‌ల్స్ ఏ మాత్రం త‌గ్గ‌కుండా క‌థ రెడీ చేస్తున్నాడ‌ట. నిజానికి కళ్యాణ్‌ రామ్‌తో బోయపాటి అని చాలా రోజుల క్రితం ఒకసారి పుకార్లు వచ్చ‌య‌నే విష‌యం తెలిసిందే. కానీ కరోనా పరిస్థితుల కారణంగా ఆ త‌ర్వాత‌ పెద్దగా వినిపించలేదు. ఇప్పుడు మాత్రం ఇద్ద‌రూ ఆ లోటును భ‌ర్తీ చేయ‌నున్నార‌ట‌.

Read more RELATED
Recommended to you

Latest news