BoyapatiRAPO : దున్నపోతుతో రామ్ ఎంట్రీ అదుర్స్..ఇక ఫ్యాన్స్ కు జాతరే

-

టాలీవుడ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.. ఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ హీరో.. రామ్ పోతినేని కాంబినేషన్ లో అదిరిపోయే పాన్ ఇండియా సినిమా రాబోతోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మరోసారి రామ్ తనలోని ఊర మాస్ అవతారంతో ఫ్యాన్స్ ని ఖుష్ చేశారు. ఇటీవలే పోలీసు పాత్రలో వారియర్ సినిమాతో ప్రేక్షకులను అలరించారు.

ఇప్పుడు బోయపాటితో తన నెక్స్ట్ సినిమాకు రెడీ అవుతున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతోంది. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది. ఇవాళ రామ్‌ బర్త్‌ డే. ఈ తరుణంలోనే..ఈ సినిమా నుంచి 𝐅𝐢𝐫𝐬𝐭 𝐓𝐡𝐮𝐧𝐝𝐞𝐫 పేరుతో ఓ టీజర్‌ ను రిలీజ్‌ చేశారు. ఇందులో దున్మపోతుతో వచ్చిన రామ్‌.. పవర్‌ ఫుల్‌ డైలాగులతో అదరగొట్టాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version