‘భారతీయుడు 2’తో త్వరలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు కమల్‌హాసన్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ఈ పాన్ ఇండియా సినిమాను శంకర్ తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 12న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ ఈవెంట్లో పాల్గొన్న ప్రముఖ కమెడియన్, నటుడు బ్రహ్మానందం తనలో ఉన్న మరో టాలెంట్ను చూపించి ఆడియెన్స్ను ఫిదా చేశారు. ఆయన మిమిక్రీ చూసి షాక్ అవుతున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కమల్ హాసన్ ఎదురుగానే బ్రహ్మానందం ఆయన్ని ఇమిటేట్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. స్పీచ్ ఇవ్వడం కోసం స్టేజ్ ఎక్కిన బ్రహ్మానందం.. కమల్‌హాసన్‌లా మాట్లాడారు.
‘‘భారతీయుడు’ మొదటి భాగాన్ని హిట్ చేశారు. ఇప్పుడు రెండో పార్ట్‌తో సిద్ధమయ్యాను. ఈ సినిమా కోసం ఎక్కువ కష్టపడ్డాను. దక్షిణాది ప్రేక్షకులు నన్నెంతో ఆదరిస్తున్నారు. నాకు సంతోషంతో మాటలు రావడం లేదు. ఈ సినిమాను మీరంతా ఆదరిస్తే ఇంకాస్త సంతోషిస్తా. మీ కమల్ హాసన్’ అని ఆయనలా మాట్లాడారు.
#Brahmanandam gaaru Imitating #KamalHassan ❤️#Bharateeyudu2 #KamalHaasan pic.twitter.com/34id3MOoVL
— Milagro Movies (@MilagroMovies) July 7, 2024