ఏదోరోజు పవన్ కల్యాణ్ ఏపీకి సీఎం అవుతారు : ఎస్జే సూర్య

-

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భవిష్యత్తులో ఏదో రోజు తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారని దర్శకుడు, నటుడు ఎస్జే సూర్య అన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం నా స్నేహితుడు అని ఏదోరోజు నేను చెబుతాను గతంలో చెప్పాను.. నేను చెప్పినట్టుగా ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. ఇక ఫ్యూచర్లో కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. ఈ ఈవెంట్లో పాల్గొన్న ఎస్జే సూర్య ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు.

కమల్‌హాసన్‌ కథానాయకుడిగా నటించిన పాన్‌ ఇండియా సినిమా ‘భారతీయుడు 2’ ని శంకర్‌ తెరకెక్కించారు. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన విజయవంతమైన సినిమా ‘భారతీయుడు’కు ఇది కొనసాగింపు. లైకా ప్రొడక్షన్స్, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. సిద్ధార్థ్, రకుల్‌ ప్రీత్‌ సింగ్, బాబీ సింహా. ఎస్జే సూర్య, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 12న థియేటర్లలోకి రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version