మాస్ కా బాప్ : బ్రేకప్ స్టోరీలో విశ్వక్ ? అసలు నిజం ఇదే !

-

జీవితం ఒక్కటే
ప్రేమ‌లు ఎంతో ఎన్నో
విడిపోయిన క‌థ‌లు
బాగున్నాయా ?
ఏమో !త‌న‌ను త‌ల్చుకుంటే బాధ
అని అంటున్నాడు మాస్ కా బాప్ విశ్వ‌క్ సేన్

మాస్ కా బాప్.. ఈ పేరు వినండి.. ఈ పేరు చ‌ద‌వి చూడండి.. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేని కుర్రాడు హిట్ ఎలా కొట్టాడో తెలుస్తుంది. ఫ‌ల‌క్ నుమా దాస్ గా ఎలా పేరు తెచ్చుకున్నాడో కూడా తెలుస్తుంది. ఆయ‌న మాస్ కా బాప్ మాత్ర‌మే కాదు యాటిడ్యూడ్ కా బాప్ కూడా ! కుర్ర కారుకు రోల్ మోడల్ .. అప్పుడ‌ప్పుడూ విజ‌య దేవ‌ర‌కొండ‌తో త‌గువేసుకునే గ‌డుసు పోర‌డు కూడా !

ఎవ‌రూ త‌న‌ను లేప‌క్క‌ర్లేదు.. నేను నా అంతట పేరు తెచ్చుకుంటాను అని చెప్ప‌గ‌లిగే ద‌మ్మున్న హైద్రాబాదీ కుర్రాడు. ఈ కుర్రాడి జీవితంలో ఓ ప్రేమ క‌థ ఉంది. క‌న్నీటి క‌థ లాంటిదే ఇది. విడిపోయిన జంట‌ల్లో ఉండే క‌థ.. ఆర్థ్ర‌త నిండిన క‌థ. ఎప్పుడు త‌న‌ను త‌ల్చుకున్నా బాధ‌గానే ఉంటుంద‌ని చెప్పే క‌థ.. ఆ వివ‌రం ఈ క‌థ‌నాన..

విశ్వక్ సేన్..ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న సినిమాతో తెలుగు తెరకు పరిచయం అతి తక్కువ కాలంలోనే క్రేజీ హీరో అయ్యాడు. అచ్చం మాస్ సినిమాలలో నటిస్తూ మాస్ ప్రేక్షకులలో మంచి పేరు తెచ్చుకున్నారు.అదృష్టం లక్క లాగా పట్టుకోవడం అంటే ఇదే..ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ ఇమేజ్ ను తెచ్చుకున్న హీరోలలో ఒకరు విశ్వక్ సేన్. ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నామా దాస్, పాగల్ వంటి మాస్ చిత్రాల లో నటించి ఊర మాస్ హీరోగా, మాస్ కా బాప్ అని పేరు తెచ్చుకున్నాడు.

ప్రస్తుతం ఇతని చేతిలో రెండు, మూడు సినిమాలు ఉన్నాయి. క్లాస్, కూల్ లుక్ లో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘అశోక వనంలో అర్జున కళ్యాణం ‘..ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది.విద్యాసాగర్ చింతా ఈ సినిమాకు దర్శ‌కత్వం వహిస్తున్నారు. పెళ్ళి ఎప్పుడూ జరుగుతుందా అని ఎదురు చూసే ఓ 30 ఏళ్ల కుర్రాడు పడే ఇబ్బందులు ఏంటో ఈ సినిమాలో చూపించారు..వేసవి కానుక మే 6 న ప్రేక్షకుల ముందుకు రానుంది..విడుదలకు కేవలం కొద్ది రోజులు ఉండటంతో సినిమా ప్రమోషన్స్‌ను షురూ చేశారు…

ఇందులో భాగంగానే సోషల్ మీడియా ద్వారా విశ్వక్ సేన్ సరదాగా కాసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సినిమాలో మీకు బ్రేకప్ స్టోరీ ఉన్నట్లు చూపించారు.మరి మీకు మీ లైఫ్ లో కూడా ఇలాంటి స్టోరీలు ఏమైనా ఉన్నాయా అని ఓ యువతి ప్రశ్నించగా..దానికి విశ్వక్ సమాధానం చెప్పాడు.. ప్రతి మగాడి లైఫ్ లో కూడా ఉంటుంది అని చెప్పకనే చెప్పాడు.రియల్ లైఫ్ లో అతనికి ఓ అమ్మాయితో బ్రేకప్ ఉందని ఒప్పుకున్నాడు. దాదాపు మూడేళ్లు డీప్ లవ్ లో ఉన్నాము..కానీ ఆమె నన్ను వదిలేసి వెళ్ళిపోయింది.ఆ విషయం గుర్తుకు వస్తే ఇప్పటికీ బాధగా ఉంటుందని అన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news