ఫ్యాక్ట్ చెక్: ప్రభుత్వం ఈవీ మాన్యుఫ్యాక్చర్స్ ని ద్విచక్ర వాహనాల్ని లాంచ్ చేయద్దని చెప్పిందా..?

-

తరచూ మనకి సోషల్ మీడియా లో ఏదో ఒక ఫేక్ వార్త కనపడుతూనే ఉంటుంది. నిజానికి ఇలాంటివి నమ్మొద్దు అని సోషల్ మీడియా లో తెగ ప్రచారం చేస్తూ ఉంటారు. ఫేక్ వార్తలు వల్ల మనమే నష్ట పోవాల్సి ఉంటుంది. స్కీములు మొదలు ఉద్యోగాల వరకూ చాలా ఫేక్ వార్తలను మనం చూస్తూనే ఉంటాం. అందుకని తెలియని వాటికీ, అనుమానంగా అనిపించే వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

 

ఇక ఇది ఇలా ఉంటే తాజాగా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులు అగ్ని ప్రమాదాలను పరిశోధించే వరకు కొత్త వాహనాలను విడుదల చేయకూడదు అని ఆదేశించింది అని వార్తలు వస్తున్నాయి. అయితే నిజంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులు ని అగ్నిప్రమాదాలను పరిశోధించే వరకు కొత్త వాహనాలను విడుదల చేయకూడదు అని మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్స్ చెప్పిందా..? ఇందులో నిజం ఎంత అనేది చూద్దాం.

అయితే గత కొన్ని నెలల నుండి చూస్తే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు పేలి పోవడం మనం చూస్తున్నాం. అందుకే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులు అగ్ని ప్రమాదాలను పరిశోధించే వరకు కొత్త వాహనాలను విడుదల చేయకూడదు అని ఆదేశించింది అని సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి.

ఇంతకీ ఇది నిజమా కాదా అనేది చూస్తే.. ఇందులో ఏ మాత్రం నిజం లేదు అని తెలుస్తోంది. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులు కి ఎలాంటి ఆదేశాలను ఇవ్వలేదు. ఇది కేవలం నకిలీ వార్తే. ఇందులో నిజం లేదు. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై స్పందించి ఇందులో నిజం లేదని చెప్పేసింది.

Read more RELATED
Recommended to you

Latest news