మూవీ అప్డేట్: పవన్ “బ్రో” ట్రైలర్ కు కౌంట్ డౌన్ 24 గంటలే … !

-

తమిళ దర్శకుడు సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న రీమేక్ సినిమా “బ్రో” లో పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎన్నో అప్డేట్ లు వచ్చి అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. టీజర్, పోస్టర్, పాటలు ఇలా ప్రతి ఒక్కటీ పవన్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుండి మరో ఇంపార్టెంట్ అప్డేట్ కు ముహుర్తాన్ని ఖరారు చేసింది చిత్ర బృందం. తెలుస్తున్న సమాచారం ప్రకారం రేపు సాయంత్రం సరిగ్గా 6 .03 గంటలకు బ్రో సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. అయితే నిన్ననే మూవీ యూనిట్ ట్రైలర్ డేట్ ను చెప్పినా. సమయాన్ని మాత్రం ఇప్పుడే ప్రకటించింది.

ఇక ఈ సినిమాను వచ్చే వారం జులై 28వ తేదీన థియేటర్ లలో రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ సినిమాలో కేతిక శర్మ మరియు ప్రియా వారియర్ లు ఫిమేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news