పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన మల్టీ స్టారర్ మూవీ బ్రో గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి అంటే వాటి సందడి దాదాపు కొంతకాలం కొనసాగుతూనే ఉంటుంది. ఇక కలెక్షన్లకు ఏ డోకా ఉండదు. టాక్ ఎలా ఉన్నా సరే మొదటి వీకెండ్ లో బడ్జెట్ లో సగం కంటే ఎక్కువే రికవరీ అవుతుందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగిందని చెప్పాలి. బ్రో సినిమా తొలి రోజే దాదాపు రూ .25 కోట్ల రేంజ్ లో కలెక్షన్లు కాబట్టి పవర్ స్టార్ రేంజ్ ఏంటో మరొకసారి బాక్స్ ఆఫీస్ వద్ద నిరూపించింది.
రీమేక్ సినిమా పైగా ఫైట్స్ లాంటివి లేని సినిమా అయినా సరే ఈ సినిమా కోట్ల రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టింది. మొదటి రోజే అనుకుంటే ఆ తర్వాత రెండు రోజులు కూడా సినిమా మంచి వసూళ్లు రాబట్టిందని చెప్పవచ్చు. ఇకపోతే మొదటి వారంలోనే దాదాపు రూ.55 కోట్ల రేంజ్ లో కలెక్షన్లు సాధించి శభాష్ అనిపించింది. మొదటి మూడు రోజుల్లో రూ.55 కోట్ల మేర కలెక్షన్లు వచ్చినా మిగతా రెండు రోజుల్లో పట్టుమని రూ .10కోట్లు కూడా రాబట్ట లేకపోయింది. అయితే ఈ సినిమా నిర్మాత విశ్వప్రసాద్ మాత్రం తాను ప్రాఫిట్ జోన్ లో ఉన్నానని చెప్పడం జరిగింది.
ఇకపోతే ఈ సినిమాకు నాన్ – థియేట్రికల్ రైట్స్ తోనే 70% పెట్టుబడి తిరిగి వచ్చిందని , మూవీ జోరు థియేటర్ వద్ద ఏ స్థాయిలో సాగుతోందో ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు అని బ్రో సినిమాతో తను చాలా హ్యాపీగా ఉన్నానని కూడా నిర్మాత చెప్పుకొచ్చారు. మొత్తానికి అయితే ఇది చూసిన కొంతమంది నెటిజన్లు నిర్మాతలు చాలా వరకు సేఫ్ గానే ఉంటారు. నష్టపోయేది డిస్ట్రిబ్యూటర్ లు, ఎగ్జిబ్యూటర్ లు అంటూ కామెంట్లు చేస్తున్నారు.