జేమ్స్‌బాండ్ మూవీల ఫ్యాన్స్‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. రూ.72వేలు గెలుచుకునే చాన్స్‌..

-

మీరు జేమ్స్ బాండ్ మూవీల‌ను ఎక్కువ‌గా చూస్తారా ? అయితే ఈ బంప‌ర్ ఆఫ‌ర్ మీ కోస‌మే. ఇప్ప‌టి వ‌రకు బాండ్ సిరీస్‌లో వ‌చ్చిన అన్ని మూవీల‌ను మీరు చూడాల్సి ఉంటుంది. అలా చూస్తే ఏకంగా 1000 డాలర్లు గెలుచుకోవ‌చ్చు. అంటే రూ.72వేలు అన్న‌మాట‌.

bumper offer to jamesbond fans can win upto 1000 dollars

జేమ్స్‌బాండ్ కొత్త మూవీ.. నో టైమ్ టు డై ఏప్రిల్ 2020లో విడుద‌ల కావ‌ల్సి ఉంది. కానీ క‌రోనా వ‌ల్ల విడుద‌ల‌ను వాయిదా వేశారు. ఈ క్ర‌మంలోనే ఈ ఏడాది అక్టోబ‌ర్ 8న ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. అయితే అప్ప‌టి వ‌ర‌కు వేచి ఉండ‌డం ఎందుక‌ని నెర్డ్ బియ‌ర్ అనే వెబ్‌సైట్ వారు జేమ్స్ బాండ్ మూవీల ఫ్యాన్స్‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించారు.

ఆ బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌కారం 30 రోజుల్లోగా మొత్తం 24 బాండ్ మూవీల‌ను చూడాలి. అలాగే వాటిని చూసిన‌ట్లు వెబ్‌సైట్‌లో రిజిస్ట‌ర్ చేసుకుని ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ ఇవ్వాలి. దీంతో అలాంటి ఫ్యాన్స్ నుంచి ఒక ల‌క్కీ ఫ్యాన్‌ను ఎంపిక చేసి ఆ ఫ్యాన్‌కు 1000 డాల‌ర్ల‌ను అందిస్తారు. అలాగే అమెజాన్‌, ఏఎంసీ గిఫ్ట్ కార్డుల‌ను అందిస్తారు. మ‌రింకెందుకాల‌స్యం.. మీర జేమ్స్‌బాండ్ ఫ్యాన్ అయితే ఈ కాంటెస్ట్‌లో పాల్గొనండి. 1000 డాల‌ర్ల‌ను గెలుచుకోండి. మ‌రిన్ని వివ‌రాల‌కు https://nerdbear.com/get-paid-1000-to-binge-watch-james-bond-movies/ అనే సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

జేమ్స్‌బాండ్ నేప‌థ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన మూవీల వివ‌రాలు…

1. డాక్ట‌ర్ నో (1962)
2. ఫ్ర‌మ్ ర‌ష్యా విత్ ల‌వ్ (1963)
3. గోల్డ్ ఫింగ‌ర్ (1964)
4. థండ‌ర్ బాల్ (1965)
5. యు ఓన్లీ లివ్ ట్వైస్ (1967)
6. ఆన్ హ‌ర్ మేజ‌స్టీస్ సీక్రెట్ స‌ర్వీస్ (1969)
7. డైమండ్స్ ఆర్ ఫ‌రెవ‌ర్ (1971)
8. లివ్ అండ్ లెట్ డై (1973)
9. ది మ్యాన్ విత్ ది గోల్డెన్ గ‌న్ (1974)
10. ది స్పై హు ల‌వ్డ్ మి (1977)
11. మూన్ రేక‌ర్ (1979)
12. ఫ‌ర్ యువ‌ర్ ఐస్ ఓన్లీ (1981)
13. ఆక్టోపస్సీ (1983)
14. ఎ వ్యూ టు ఎ కిల్ (1985)
15. ది లివింగ్ డే లైట్స్ (1987)
16. లైసెన్స్ టు కిల్ (1989)
17. గోల్డెన్ ఐ (1995)
18. టుమారో నెవ‌ర్ డైస్ (1997)
19. ది వ‌ర‌ల్డ్ ఈజ్ నాట్ ఎన‌ఫ్ (1999)
20. డై అన‌ద‌ర్ డే (2002)
21. క‌సినో రోయాల్ (2006)
22. క్వాంట‌మ్ ఆఫ్ సొలేస్ (2008)
23. స్కై ఫాల్ (2012)
24. స్పెక్ట‌ర్ (2015)
25. నో టైమ్ టు డై (2021, అక్టోబ‌ర్ 8)

Read more RELATED
Recommended to you

Latest news