Butta Bomma Trailer : ‘బుట్టబొమ్మ’ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌..అందమైన ప్రేమ కథ

-

ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్.. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఫీల్ గుడ్ రూరల్ డ్రామా బుట్ట బొమ్మ.. సూర్యదేవర నాగ వంశీ , సాయి సౌజన్య సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ చైల్డ్ ఆర్టిస్టు అనికా సురేంద్రన్ మొదటిసారి ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం కాబోతోంది.

ఈమెతో పాటు అర్జున్ దాస్, సూర్య వశిష్ట ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని శౌరీ చంద్రశేఖర్ రమేష్ దర్శకత్వం వహిస్తూ.. మొదటిసారి తెలుగు ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఫిబ్రవరి 4వ తేదీన ఈ చిత్రం భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కాబోతున్న నేపథ్యంలో.. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ ను రిలీజ్‌ చేశారు. ఇక ఈ సినిమా ఓ వీలేజ్‌ లవ్‌ స్టోరీ గా ట్రైలర్‌ చూస్తే అనిపిస్తోంది. అలాగే, ఈ ట్రైలర్‌ లో మంచి విజువల్స్‌, ప్రేమ బాగా చూపించారు.

Read more RELATED
Recommended to you

Latest news