మెగాస్టార్ చిరంజీవి గురించి టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు వరుసగా ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా తెరకెక్కిన సినిమాలలో నటించిన ఈయన ఇప్పుడు మాత్రం రొటీన్ కు భిన్నంగా విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నారు. ఇకపోతే పలు సినిమాలలో సీరియస్ రోల్స్ లో నటిస్తుండగా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందివ్వడం లేదు. ఈ క్రమంలోనే ఆయన వరుసగా రీమేక్ సినిమాలలో నటించడంపై కూడా ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
2022వ సంవత్సరం దసరా కానుకగా విడుదలైన సినిమాలలో అంతో ఇంతో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాగా కూడా గాడ్ ఫాదర్ పేరు తెచ్చుకుంది. అయితే ఈ సినిమాను ఓన్ గా రిలీజ్ చేయగా ఫుల్ రన్ ముగిసేసరికి 60 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను కూడా సొంతం చేసుకో లేకపోవడం గమనార్హం. లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఒరిజినల్ తో పోల్చి చూస్తే ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిస్థాయిలో విఫలం అయింది. తాజాగా ఈ సినిమా బుల్లితెరపై ప్రసారం కాగా ఈ సినిమా చూసి ఇండస్ట్రీ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నారు.
జెమిని ఛానల్ లో ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రసారం కాగా.. కేవలం 7.7 రేటింగ్ మాత్రమే వచ్చింది. ఒకవైపు కళ్యాణ్ రామ్ బింబిసారా మూవీ రేటింగ్ తో పోల్చి చూస్తే గాడ్ ఫాదర్ రేటింగ్ తక్కువగా ఉండడం గమనార్హం. బుల్లితెరపై కూడా గాడ్ ఫాదర్ సినిమా యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. అఖండ, బంగార్రాజు సినిమాలతో కూడా గాడ్ ఫాదర్ పోల్చి చూస్తే కొంచెం బెటర్ రేటింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా చిరంజీవి సినిమా అంటే ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ ఆశిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆయన సినిమాలను తెరకెక్కిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారని చెప్పవచ్చు. అందుకు నిదర్శనం వాల్తేరు వీరయ్య అనడంలో ఎటువంటి సందేహం లేదు.