కరోనా ఎఫెక్ట్ ప్రతీ ఇండస్ట్రీకి భారీగా తగిలింది. కొన్ని ఇండస్ట్రీస్ అయితే ఇపట్లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. అలాంటి ఇండస్ట్రీస్ లో చిత్ర పరిశ్రమ కూడా ఒకటి. ప్రతీ వారం చిన్న సినిమా నుండి మీడియం రేంజ్ సినిమాలవరకు చాలా థియోటర్స్ లోకి వచ్చి సందడి చేస్తుంటాయి. ఇక ప్రేక్షకులకి వారాంతరాలలో పెద్ద రిలీఫ్ అంటే సినిమానే. ఫ్యామిలీస్ తో సరదాగా శని, ఆదివారాలలో ఒక సినిమా చూసి ఎంజాయ్ చేస్తుంటారు.
కాని ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. లాక్ డౌన్ కారణంగా గత కొన్ని వారాలుగా అందరూ ఇళ్ళకే పరిమితం అయ్యారు. అయితే ముఖ్యంగా ఈ లాక్ డౌన్ పీరియెడ్ అనేది చాలా నష్టాల్లోకి, కష్టాల్లోకి నెట్టేసింది. చిన్న హీరో దగ్గర్నుంచి పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో వరకు అందరు నటించి రిలీజ్ చేయాలనుకున్న సినిమాలు ఇప్పట్లో థియోటర్స్ లో బొమ్మ పడే అవకాశం లేదు. ముఖ్యంగా ఈ ఎఫెక్ట్ కొందరు హీరోలకి లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చిన హిట్ పడ్డ వాళ్ళకే పడుతుందని సమాచారం.
“ఇస్మార్ట్ శంకర్” లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరవాత రామ్ నటిస్తోన్న సినిమా “రెడ్”. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మిస్తున్నారు. నివేదా పేతురాజ్ హీరోయిన్ గా… హెబ్బా పటేల్ గెస్ట్ అపీరీయన్స్ తో పాటు ఒక స్పెషల్ సాంగ్ చేస్తోంది. కరోనా ప్రభావం తగ్గి థియేటర్లు ఓపెన్ అయితే జూన్ మూడో వారంలో ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు రామ్ తో పాటు మేకర్స్ కూడా డైలమాలో పడ్డారట. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాని రిలీజ్ చేస్తే కనీసం పెట్టిన పెట్టుబడి అయినా తిరిగి వస్తుందా అని ఆలోచనలో పడ్డారట. ఒక రకంగా రామ్ కి ఇది పెద్ద దెబ్బ అని అంటున్నారు.