తెలంగాణలో అష్టా చమ్మా.. ఆంధ్రలో పేకాట..

-

కరోనా నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఇళ్లకే పరిమితం అయితే కరోనాను నియంత్రించవచ్చని కేంద్రం తెలిపింది. అలాగే నిత్యావసరాల కొనుగోలు చేయడం కోసం కుటుంబం నుంచి ఒక్కరే వెళ్లాలని కూడా సూచించింది. బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించడంతో పాటుగా మాస్క్ ధరించాలని ఆదేశించింది. తద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపింది. అయితే కొందరు మాత్రం లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించడం ద్వారా తమతో పాటుగా, ఇతరులను కూడా ప్రమాదంలో నెడుతున్నారు.

మరి ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో టైమ్ పాస్ కోసం చేసే పనులే కరోనా వ్యాప్తికి కారణమవుతున్నాయి. ఇరుగు పొరుగు వారితో కలిసి ఆటలు ఆడటం, ఒక చోటు చేరి ముచ్చట్లు పెట్టడం లాంటివి చేయడం ద్వారా కొందరు తమకు తెలియకుండానే కరోనాను తోటివారికి అంటిస్తున్నారు. ఇటీవల సూర్యాపేట జిల్లాలో తబ్లగి సభ్యులను కలిసి ఓ మహిళా.. తనకు కరోనా ఉన్న విషయం తెలియక చుట్టుపక్కల వారితో కలిసి అష్టా చమ్మా ఆడింది. దీంతో ఆమె ద్వారా 31 మందికి కరోనా సోకింది.

తాజాగా అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ కృష్ణలంకలో చోటుచేసుకుంది. ఓ లారీ డ్రైవర్ లాక్ డౌన్ ఉల్లంఘించి ఇరుగుపొరుగు వారితో కలిసి పేకాట ఆడాడు. దీంతో అతని నుంచి మరో 24 మందికి కరోనా వ్యాపించింది. ఈ విషయాన్ని కృష్జా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ శనివారం వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news