స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ అంటే అందరికి గుర్తొచ్చేది ఆర్య, ఆర్య 2 అన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే అందరికి భారీగా అంచనాలు ఉంటాయి. ఇక సుకుమార్ రంగస్థలం వంటి బాల్ బస్టర్ అలాగే అల్లు అర్జున్ అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అందరు ఈ సినిమా మీద ఎంతో క్యూరియాసిటితో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలై ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా కరోనా అత్యంత వేగంగా వ్యాపిస్తూ యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో 21 రోజులు పాటు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇక మన దేశంలో కరోనా బారిన పడ్డ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు 570 పైనే నమోదయ్యాయి. అంతేకాదు కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 10కి చేరింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినా పాజిటివ్ కేసులు నమోదవడం బాధాకర్మ్.
ఇక ఈ కరోనా ఎఫెక్ట్ తోనే సినిమా ఇండస్ట్రీ మొత్తం షూటింగ్స్ ని నిలిపి వేసి స్వీయ నిర్భంధం లో ఉన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ తో సహా అన్ని చిత్ర పరిశ్రమలు షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చాయి.
ఇక మన టాలీవుడ్ లో చిన్న సినిమాల నుండి ఆర్.ఆర్.ఆర్ వంటి భారి బడ్జెట్ సినిమాల వరకు షూటింగ్ కి అర్ధాంతరంగా బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో
అల్లు అర్జున్ సుకుమార్ ల సినిమా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తాజా షెడ్యూల్ ని కేరళలో ప్లాన్ చేశారు. దేశంలో కరోనా ప్రభావం వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం కేరళలో అనుకున్న షూటింగ్ ని క్యాన్సిల్ చేసుకున్నారట సుకుమార్ బృందం. ఈ నేపథ్యంలో నెక్స్ట్ షెడ్యూల్ ని ఇప్పట్లో ప్లాన్ చేసే ఆలోచనలో సుకుమార్ లేడని తెలుస్తుంది. దీనితో బన్నీ-సుకుమార్ ల సినిమా 2020లో రిలీజ్ కావడం కష్టమని అంటున్నారు. ఇక ఈ సినిమా అల్లు అర్జున్ కి 20 వ సినిమా కావడం విశేషం. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన కన్నడ బ్యూటి రష్మిక మందన్న నటిస్తుంది.