తప్పు బాధితులదే అంటారా?.. సెలీనా జెట్లీ ఆసక్తికర పోస్ట్‌

-

కోల్‌కతాలో జూనియర్‌  వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనకు సంబంధించి  దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో పలువురు ప్రముఖులు తమ మనసులోని భావాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. తాజాగా నటి సెలీనా జెట్లీ కూడా తన చిన్నతనంలో జరిగిన చేదు అనుభవనాలను షేర్ చేసుకున్నారు.

‘‘నేను స్కూల్కు వెళ్తున్నప్పుడు సమీపంలో ఉన్న యూనివర్సిటీ విద్యార్థులు నా వెంటపడుతూ అల్లరి పెట్టేవారు. నాపై రాళ్లు విసిరేవారు. మా టీచరుకు చెబితే నీ నువ్వు మోడ్రన్గా ఉంటావు. కాస్త వదులు దుస్తులు ధరించి, తలకు నూనె పెట్టుకొని రెండు జడలు వేసుకో. ఇది నీ తప్పే’ అని ఆమె నన్నే తప్పుబట్టారు. ఓరోజు ఉదయం స్కూలు రిక్షా కోసం ఎదురుచూస్తున్నా. ఓ వ్యక్తి నా ఎదురుగా వచ్చి తన ప్రైవేటు భాగాలు చూపించాడు. దీన్ని తలచుకొని అవును.. నా తప్పేనేమో అని నేను చాలా ఏళ్లు కుమిలిపోయా.’’ అని సెలీనా తన బాల్యంలో చోటుచేసుకున్న చేదు జ్ఞాపకాలను పంచుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news