Raksha Bandhan : రాఖీ కట్టాల్సిన శుభ ముహూర్తం ఇదే

-

అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగానికి ప్రతీక రాఖీ పౌర్ణమి. దేశవ్యాప్తంగా ఇవాళ ఈ పండుగను జరుపుకుంటున్నారు. తమ సోదురల కోసం తోబుట్టువులు ఇప్పటికే రాఖీలు సిద్ధం చేసుకున్నారు. ఇక దూర ప్రాంతాల నుంచి పుట్టింటికి చేరుకుని అన్నదమ్ములకు రాఖీ కట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇవాళ జరుపుకుంటున్న ఈ పండుగకు భద్రకాలం వస్తోంది. అందువల్ల భద్రకాలంలో రాఖీ కట్టుకోకూడదని.. అలా కడితే అన్నదమ్ములకు, తోబుట్టువులకు కీడు జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఇవాళ భద్ర కాలం ఎప్పుడు ముగుస్తుంది? రాఖీ ఏ సమయంలో కట్టాలి?

ఇవాళ సూర్యోదయాన 5:53 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1:32 గంటల వరకు భద్రకాలం ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయం పూర్తయ్యాకే అంటే 1.32 గంటల తర్వాతే రాఖీ పండుగ జరుపుకోవాలని అంటున్నారు. మధ్యాహ్నం 1:33 గంటల నుంచి రాత్రి 9:08 గంటల వరకు.. అందులోనూ మధ్యాహ్నం 1.43 గంటల నుంచి 4.20 గంటలు, సాయంత్రం 6.56 నుంచి రాత్రి 9.08 సమయంలో రాఖీ కడితే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news