ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక సినిమా చేస్తే దానికి సంబంధించి ఎన్నో వివాదాలు ఉంటాయి. ఒక సినిమాను ఆయన వివాదాలు లేకుండా తీయడం అనేది అసలు జరిగే పవన్ కాదు. ఇప్పుడు ఆయన చేసిన ఆర్జీవీ సినిమా కూడా దాదాపు అదే విధంగా ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి చాలానే వివాదాలు వచ్చాయి. ఇప్పుడు మరో వివాదం ఈ సినిమాను వెంటాడింది.
సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ ఆయనకు షాక్ ఇచ్చింది. అనుమతి లేకుండా పవర్ స్టార్ సినిమా పోస్టర్లు ఆర్జీవీ టీం ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా 30కి పైగా పోస్టర్లు ఏర్పాటు చేసింది. ఇన్ఫోర్స్మెంట్ టీం , డీఆర్ఎఫ్ టీమ్స్ తనిఖీలలో ఏ ఒక్క దానికి అనుమతి తీసుకోలేదని నిర్ధారణ అయింది. కంప్లైంట్స్ ని స్వీకరించి అనుమతి లేని రెండు పోస్టర్లకు 88000 రూపాయల పెనాలిటీ వేసింది సిఈసి టీం. అదే విధంగా ఈవీడీఎం డిపార్ట్మెంట్ నుండి నోటీసులు కూడా అందుకుంది ఆర్జీవీ టీం.